Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో బొప్పాయి కోసం కొట్టేసుకుంటున్నారు!
By: Tupaki Desk | 24 Sep 2019 10:54 AM GMTఏంది.. బొప్పాయిల కోసం మార్కెట్లో భారీ ఫైటింగ్ చోటు చేసుకుందా? అంటే అవుననే చెప్పాలి. కిలో పాతిక కూడా చేయని బొప్పాయిల కోసం ఫైటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం వస్తే.. ఇలాంటి వారు అప్డేట్ కావాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. గడిచిన రెండు నెలలుగా హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున వైరల్.. డెంగ్యూ ఫీవర్లతో ఆగమాగం కావటం తెలిసిందే.
సర్కారీ.. ప్రైవేటు అన్న తేడా లేకుండా దవాఖానాలన్ని రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇళ్లల్లో ఒకరికి జ్వరం తగ్గిందంటే చాలు మరొకరికి స్టార్ట్ కావటం.. ఇల్లంతా జ్వరాల మయం కావటంతో తీవ్రఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇలాంటి వేళ.. అంతకంతకూ విస్తరిస్తున్న డెంగ్యూ ఫీవర్ విజృంభణకు చెక్ పెట్టేలా ఒక సందేశం వైరల్ అయ్యింది.
అదేమంటే.. డెంగ్యూ ఫీవర్ కు బొప్పాయి చక్కటి సొల్యూషన్ అని.. అది తిన్నా.. దాని జ్యూస్ తాగినా మంచిదన్న వార్తను గుడ్డిగా ఫాలో అవుతున్నారు. కొందరైతే బొప్పాయి తినాల్సింది పోయి.. దాని ఆకుల్ని జ్యూసుగా మార్చేసి.. వాడేయటం వల్ల కొత్త జబ్బులకు గురి అవుతున్నారు. బొప్పాయి తినటం వల్ల ప్లేట్ లెట్స్ పెరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగటంతో దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకూ బొప్పాయి తిననోళ్లు సైతం తినేస్తున్నారు.
బొప్పాయితో డెంగ్యూకు చెక్ చెప్పొచ్చన్న మాటతో కేజీ పదిహేను.. పాతిక ఉన్నది కాస్తా ఏకంగా వందకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల కురిసిన వర్షాలతో బొప్పాయి దిగుబడి తగ్గింది. ఒకవైపు మస్తు డిమాండ్.. మరోవైపు పంట లేకపోవటంతో ధర ఆకాశమే హద్దుగా దూసుకెళుతోంది. ఇదే తాజా వీధి పోరాటానికి కారణమైంది. ఈ రోజు హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కు పలువురు రైతులు బొప్పాయి పంటను తీసుకొచ్చారు.
బయట మార్కెట్లో కేజీ వందరూపాయిలకు అమ్ముతున్న బొప్పాయిని పదికి.. పాతికకు అమ్మాలని హోల్ సేల్ వ్యాపారులు ఒత్తిడి తేవటంతో రైతులకు ఒళ్లు మండింది. బయట ఉన్న రేటుకు.. మీరు అడుగుతున్న రేటుకు సంబంధం లేదే? అంటూ ఎవరి పంటను వారు అమ్ముకోవటం మొదలెట్టారు.
దీనిపై వ్యాపారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులతో వాదులాటకు దిగారు. దళారులు చెబుతున్న రేట్లు నచ్చక రైతులు తమకు తోచినట్లు మార్కెట్ బయట అమ్మకాలు షురూ చేయటంతో వారి ఆగ్రహం హద్దులు దాటింది. రైతుల మీద దాడికి దిగారు. దీంతో.. తమ పంట అమ్ముకోవాలంటే ఎవరి పర్మిషన్ ఏమిటంటూ? రైతులు సై అంటే సై అన్నారు. దీంతో.. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కాస్తా వీధి పోరాటంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని శాంతింపచేసి.. విచారిస్తున్నారు. గొడవకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది.