Begin typing your search above and press return to search.
పీక్ స్టేజ్ కెళ్లిన తమ్ముళ్ల లొల్లి
By: Tupaki Desk | 25 Oct 2015 3:48 AM GMTతెలంగాణ తెలుగు తమ్ముళ్ల నడుమ అంతర్గత పోరు మరింత పెరిగింది. గత కొంతకాలంలో పార్టీలో చాపకింద నీరులా సాగుతున్న అధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. పార్టీ సమావేశంలో ముఖ్యనేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు.. రేవంత్ రెడ్డిల నడుమ మాటలు కోటలు దాటాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయికి చేరుకున్న పరిస్థితి. ఒకదశలో వ్యక్తిగత విమర్శల వరకూ మాటలు వెళ్లటం గమనార్హం.
ఏం జరిగింది..?
ఎర్రబెల్లి.. రేవంత్ రెడ్డిల మధ్య అధిపత్య పోరు బహిరంగ రహస్యమే. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యూహం సిద్ధం చేసేందుకు శనివారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి.. రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకొని.. ఒకరినొకరు బాహాటంగానే తిట్టేసుకున్నారు. తీవ్రస్థాయికి చేరిన వీరి మాటలతో మిగిలిన నేతలంతా షాక్ తిన్న పరిస్థితి. రేవంత్ పై ఎర్రబెల్లి పరుషంగా మాట్లాడటంతో ఈ లొల్లి షురూ అయ్యింది.
ఎర్రబెల్లికి అంత కోసం ఎందుకు?
తన దగ్గరగా పీఏగా పని చేసే వ్యక్తిని ఆ మధ్యన తొలగించారు. అతగాడిని రేవంత్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఉద్యోగానికి పెట్టి రేవంత్ జీతం ఇస్తున్నారు. తాను తొలగించిన వ్యక్తి పార్టీ ఆఫీసులో కనిపించటంతో ఎర్రబెల్లి వాకబు చేయటం.. రేవంత్ నియామకం అన్న విషయం తెలియటంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
దీనిపై రేవంత్ వాదనేంటి?
ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లటం.. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలైన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి ఎర్రబెల్లి పీఏ కూడా హాజరయ్యారు. ఈ విషయంపై అగ్రహం చెందిన ఎర్రబెల్లి ఆ ఉద్యోగిని తొలగించారు. దీంతో.. తనను ఆశ్రయించిన సదరు వ్యక్తికి తాను జీతం ఇస్తూ పార్టీ కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సదరు వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు.
ఎర్రబెల్లి అభ్యంతరం ఏమిటి?
తాను ఉద్యోగంలో నుంచి తీసిన వ్యక్తికి రేవంత్ ఉద్యోగం ఇవ్వటం ఏమిటన్నది ఎర్రబెల్లి వాదన. ఇలాంటి దూకుడు పనులు వద్దన్నది ఆయన అభిమతం. తాను తీసేసిన వ్యక్తికి రేవంత్ ఉద్యోగం ఇవ్వటం ఏమిటని? ఇదెలాంటి సంకేతాన్ని ఇస్తుందన్నది ఎర్రబెల్లి వాదన.
ఎంతలా తిట్టుకున్నారంటే..
ఉద్యోగి నియమకానికి సంబంధించి తొలుత ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేయటం.. ఈ సందర్భంగా రేవంత్ పై ఎర్రబెల్లి కొన్ని విమర్శలు చేశారు. ‘‘నా దగ్గర పని చేసిన మనిషిని నువ్వు ఉద్యోగంలో పెట్టుకోవటం ఏంటి? నీ వల్ల తెలంగాణలో పార్టీకి ఇప్పటికే నష్టం జరిగింది. పరువు పోయింది. కొంచెం తగ్గితే మంచిది’’ అని అగ్రహం వ్యక్తం చేయగా.. దీనికి తీవ్రంగా స్పందించిన రేవంత్.. ‘‘జైలు నుంచి విడుదలవుతున్నానని అభిమానంతో నా దగ్గరకొస్తే ఉద్యోగం నుంచి తీసేస్తవా? రెడ్డోడు టీడీఎల్పీల పని చేయొద్దా?’’ అని ప్రశ్నించటంలో వాతావరణం మరింత వేడెక్కింది.
మాటలు ఎంతలా హద్దులు దాటాయంటే..
ఇలా ఒకరినొకరు తీవ్రస్థాయిలో తిట్టుకుంటున్న వేళ.. మాటలు ఒక్కసారి హద్దులు దాటాయి. ఎర్రబెల్లి మాటలకు తీవ్రంగా స్పందించిన రేవంత్.. ‘‘నేను జీతం ఇస్తూ పార్టీ కార్యాలయంలో పని చేయిస్తుంటే మధ్యల నీ పెత్తనం ఏంది? అయినా నేను వేరే పార్టీ వాడినా? నేను చేసిందంత పార్టీ కోసమే. నీ లెక్క కోవర్టు కాదు. నా జోలికొస్తే రూంలేసి కొడ్తా..’’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దీంతో.. ఎర్రబెల్లి ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘‘సక్కగా మాట్లాడు. తమాషా చేస్తున్నవా? నా సంగతి నీకు తెల్వదు’’ అని అన్నారు.
దీనికి రేవంత్ ధీటుగా.. ‘‘నీకు నీ వాళ్లు ఎంతో.. నాకు నా వాళ్లు అంతే. నువ్వు నన్నేం చేయలేవ్’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ వ్యక్తిగత విమర్శల్లోకి వెళ్లిపోయారు. ఈ సీన్ అంతా చూస్తున్న తెలంగాణ తెలుగుదేశం నేతలకు నోట వెంట మాట రాని పరిస్థితి. ఏమీ మాట్లాడలేకపోయారు. వ్యవహారం చేజారిపోయిందన్న విషయం అర్థం చేసుకున్న రమణ కల్పించుకొన్నారు. ఎర్రబెల్లికి మద్ధతుగా మాట్లాడుతూ.. ‘‘ఆయన పీకేసినోడిని నువ్వెందుకు పెట్టుకుంటావ్’’ అని ప్రశ్నించటంతో పాటు.. దూకుడు తగ్గించుకోవాలన్న వ్యాఖ్య చేసినట్లు చెబుతున్నారు. రేవంత్ మాటలతో నొచ్చుకున్న ఎర్రబెల్లి సమావేశం మధ్యనుంచి లేచి వెళ్లిపోతుంటే.. మిగిలిన నేతలు సర్దిబెప్పారు. ఎళ్ల తరబడి పార్టీలో క్రమశిక్షణతో పని చేస్తున్నామే తప్ప పరిమితి దాటలేదని సీనియర్లు రేవంత్ ను ఉద్దేశించి హితవు పలికినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం తెలంగాణ తెలుగు దేశం పార్టీని కుదిపేసినట్లుగా చెబుతున్నారు.