Begin typing your search above and press return to search.
గులాబీ తోటలో కొట్టుకుంటున్న ఎమ్మెల్యేలు
By: Tupaki Desk | 20 Nov 2019 2:30 PM GMTవారిద్దరూ గులాబీ ఎమ్మెల్యేలు.. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన కీలక నేతలు.. బహిరంగంగానే పరోక్ష యుద్ధం చేస్తున్నారు. కనిపిస్తే కొట్టుకోవడమే అన్న తీరుగా వీరిద్దరి వ్యవహారశైలి సాగుతోంది. మహబూబ్ నగర్ పాత జిల్లా పరిధిలోని అలంపూర్ - గద్వాల టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల పంచాయతీ ఇప్పుడు టీఆర్ ఎస్ లో సెగలు కక్కుతోందట..
అలంపూర్ లో జిల్లా మంత్రి పర్యటన ఉంటే గద్వాల ఎమ్మెల్యేకు నచ్చచెప్పి అలంపూర్ రాకుండా పోలీసులు హైదరాబాద్ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అలంపూర్ - గద్వాల ఎమ్మెల్యేల పోరు పతాక స్థాయికి చేరిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని చెబుతున్నారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఇసుక దందా చేస్తున్నాడని.. అక్రమాలకు పాల్పడుతున్నాడని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఆరోపించారు. ప్రెస్ మీట్లతో మీడియాలో రచ్చ రచ్చ చేశారు. దీనికి ప్రతిగా కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ లో విపక్షాలతో కలిసి అబ్రహంను ఇరుకునపెడుతున్నారట. ఇలా గులాబీ ఎమ్మెల్యేల మధ్య ఇసుక పంచాయితీ జిల్లాలో రాజకీయ వేడి రగిలించింది.
మాజీ మంత్రి జూపల్లితో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం బాగా క్లోజ్ గా ఉంటారు. ఇక ప్రస్తుత మంత్రి నిరంజన్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సన్నిహితంగా ఉంటారు. ఈ రెండు గ్రూపులకు పడక ఇప్పుడు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. గద్వాల జిల్లాలో ఇప్పుడు ఈ ఇద్దరి ఎమ్మెల్యేల వార్ నివురుగప్పిన నిప్పులా మారింది. టీఆర్ ఎస్ అధిష్టానం - జిల్లా మంత్రి కూడా పట్టించుకోకపోవడంతో గులాబీ ఎమ్మెల్యేల మధ్య వార్ కొనసాగుతోంది. దీనికి ఎప్పుడు తెరపడుతుందోనని గులాబీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.