Begin typing your search above and press return to search.
అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతున్న కవిత ఎన్నిక
By: Tupaki Desk | 19 Jun 2020 7:10 AM GMTనిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతోంది. ఇద్దరు చెరో పార్టీల్లో ఉండడంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎవరి బలం వాళ్లు చూయించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవిత గెలుపు కోసం టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు ఒకవైపు సాగుతుంటే మళ్లోసారి కవితను ఓడించేందుకు మరో పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో ఆ సోదరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. వీరుద్దరూ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తనయులు.
అర్వింద్ బీజేపీ ఎంపీగా, సంజయ్ టీఆర్ఎస్ లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత టీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే. కవితను గెలిపించేందుకు గులాబీ పార్టీ, ధర్మపురి సంజయ్ ని రంగంలోకి దించింది. ఆమె గెలుపుకు బలం ఉన్నా ముందస్తు జాగ్రత్తగా టీఆర్ఎస్ చర్యలు తీసుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓటమికి ఇతరులతో కలిసి అర్వింద్ పనిచేశాడు. ఇప్పుడు కూడా ఆ విధంగా చేసే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ అప్రమత్తంగా ఉంది. అందుకే ఎంపీ అరవింద్ కు చెక్ పెట్టేందుకు అతడి సోదరుడు సంజయ్ ను రంగంలోకి దింపింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న బీజేపీ కార్పొరేటర్లకు సంజయ్ గాళం వేస్తున్నాడు. దీంతో నలుగురు కార్పొరేటర్లు బీజేపీ వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లారంట. మిగతా వారిని రప్పించేందుకు సంజయ్ చక్రం తిప్పుతున్నారట. తనకున్న పాత పరిచయాలతో వారిని కలుస్తూ, కారు ఎక్కించే పనిలో ఉన్నారు. భారీగా తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ జిల్లాలో పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తోంది. ఎంపీ అర్వింద్ అధికార పార్టీకి తలనొప్పిగా మారాడు. స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలతో అతడికి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉండటంతో, ఈ ఎన్నికలపై రాష్ట్రస్థాయిలో ఆసక్తి నెలకొంది. కవిత గెలుపు ఖాయమే కానీ పోటీ అనేది లేకుండా గెలవాలని టీఆర్ఎస్ వ్యూహం. అందులో భాగంగానే కార్పొరేషన్ లో బలంగా ఉన్న బీజేపీని దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కనీసం 10 మంది బీజేపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చడం లక్ష్యంగా మాజీ మేయర్ సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. దీన్ని గమనించిన ఎంపీ అర్వింద్ అప్రమత్తమై కార్పొరేటర్లతో సమావేశమై వారికి భరోసా ఇచ్చారట.
ఈ విధంగా సోదరుల ఒకరిపై ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. సోదరుల మధ్య చిచ్చు రేపుతోంది. కవితను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు ధర్మపురి సంజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆమె ఓటమే లక్ష్యంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ పావులు కదపుతున్నారు.