Begin typing your search above and press return to search.

పెళ్లిలో చికెన్ కోసం లొల్లి.. చివరికీ ఏమైందీ?

By:  Tupaki Desk   |   28 Nov 2022 2:30 PM GMT
పెళ్లిలో చికెన్ కోసం లొల్లి.. చివరికీ ఏమైందీ?
X
పెళ్లి వేడుకల్లో చిన్నచిన్న గొడవలు జరగడం కామన్. ఆడపెళ్లి వారు మగ పెళ్లివారికి మర్యాదలు తక్కువ చేశారనో.. లేదంటే మగ పెళ్లి వారు తమపై పెత్తనం చేస్తున్నారనే కారణంతో ఆడ పెళ్లి వాళ్లో అలకలు పూనుతుంటారు. ఈ క్రమంలోనే పెళ్లి పెద్దలు రంగంలోకి దిగి ఇరువర్గాలు నచ్చజెప్పి పెళ్లి సజావుగా జరిగేలా చేస్తారు. దీంతో పెళ్లికి శుభం కార్డు పడటంతో అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు.

కానీ కొన్ని పెళ్లిలో చిన్న చిన్న గొడవలే పెద్ద ఘర్షణలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా పెళ్లి అయిన తర్వాత భరత్(డీజే) సమయంలో జరుగుతుండటం మనమంతా చూసే ఉంటాం. అయితే కొన్నిసార్లు మాత్రం ఆ గొడవలే చివరకు వధూవరులను పెళ్లిపీఠ లెక్కకుండా చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టకు చెందిన వరుడికి.. కుత్బుల్లాపూర్ కు చెందిన వధువుకు పెళ్లి కుదిరింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల పెద్దలు.. స్నేహితులు.. బంధువులంతా పెళ్లికి సిద్ధమయ్యారు. మరికొద్ది గంటల్లో పెళ్లి జరుగబోతుంది అనగా వరుడు తరుపు స్నేహితులకు.. వధువు తరుపు బంధువులకు మధ్య గొడవ జరిగింది.

వధువు తరుపు వారు శాఖాహార భోజనం ఏర్పాటు చేశారు. అయితే వరుడి స్నేహితులు మాత్రం తమకు చికెన్ కావాలంటూ గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి పెద్ద ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కొట్టుకునే స్థాయికి చేరుకోవడంతో పెళ్లి ఆగిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

చికెన్ వండలేదని వరుడు తరుపు బంధువులు ఏకంగా పెళ్లినే కాన్సిల్ చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా భోజనం విషయంలో జరిగిన గొడవ నూతన వధూవరులను పెళ్లి పీఠ లెక్కలేకుండా చేయడం మాత్రం శోచనీయంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద తెలియజేయండి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.