Begin typing your search above and press return to search.
వైసీపీలో పోరు : హిందూపురం...ఆందోళనకరం
By: Tupaki Desk | 19 July 2022 1:30 PM GMTఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అది అన్న గారి సీటు. ఎన్టీయార్ పలు మార్లు అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన తరువాత రాజకీయ వారసులుగా నందమూరి హరిక్రిష్ణ 1996 జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆయన తరువాత నందమూరి బాలక్రిష్ణ 2014 నుంచి రెండు సార్లు అక్కడ నుంచి వరసగా గెలుస్తూ వస్తున్నారు. హిందూపురాన్ని ఒక విధంగా నందమూరిపురం అని కూడా సరదాగా అంటారు.
ఎందుకంటే ఎక్కడో క్రిష్ణా జిల్లాకు చెందిన నందమూరి కుటుంబం హిందూపురంలో జెండా ఎగరవేయడం అంటే సామాన్యమైన విషయం కానే కాదు. ఇక హిందూపురంలో ఎన్టీయార్ పవర్ అలాగే ఉంది. టీడీపీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. బాలయ్యకు రాయలసీమలో మంచి క్రేజ్ ఉంది. ఇవన్నీ కలసి జగన్ వేవ్ లో కూడా అక్కడ బాలయ్య జెండా పాతేలా చేశాయి. వీటన్నింటికీ తోడు హిందూపురం వైసీపీలో వర్గ పోరు కూడా టీడీపీకి బాగా కలసివస్తోంది.
అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నాయకులు వైసీపీలో కీలకంగా ఉన్నారు. వారంతా ఎవరికి తోచిన తీరున చక్రం తిప్పేస్తున్నారు. దాంతో వైసీపీ ఈ వర్గపోరులో నలిగిపోతోంది. తాజాగా హిందూపురం నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాయలసీమ జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక సమావేశం ఏర్పాటు చేసినా ఫలితం లేకపోగా వర్గపోరు ఎంతలా ముదిరింది అన్నది పెద్దిరెడ్డి స్వయంగా చూశారని చెబుతున్నారు.
ఎమ్మెల్సీగా హిందూపురం ఇంచార్జిగా ఉన్న ఇక్బాల్ మీద హిందూపురం వైసీపీ నాయకులు గట్టిగానే ఫిర్యాదులు చేశారు. ఆయన బయట నుంచి వచ్చారు. హిందూపురానికి నాన్ లోకల్. ఆయన పెత్తనమేంటి అని కూడా వారు మండిపడ్డారు. ఇలా నవీన్ నిశ్చల్ అబ్దుల్ ఘనీ ఇక్బాల్ మీద గట్టిగా ఫిర్యాదు చేశార్. ఆయన నాయకత్వంలో పనిచేయలేమని కూడా స్పష్టం చేశారు. ఆయన్ని ఇంచార్జిగా ఉచితే తాము అసలు పనిచేయమని కూడా తేల్చేశారు.
అంతే కాదు ఇక్బాల్ కి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని కూడా చెప్పారట. ఆయన కాకుండా ఎవరిని ఇంచార్జిగా నియమించినా టికెట్ ఇచ్చినా తాము పనిచేస్తామని వారిద్దరూ చెప్పేసరికి పెద్దిరెడ్డికి ఏం జవాబు చెప్పాలో పాలుపోలేదు అంటున్నారు. మరో వైపు ఇదే సమావేశంలో ఇక్బాల్ కూడా తన వాదన వినిపించారు అని అంటున్నారు. తనను జగన్ ఆదేశించాలని, ఆయన చెప్పిన మరుక్షణం తాను హిందూపురం దరిదాపులకు కూడా రాకుండా వెళ్ళిపోతానని ఇక్బాల్ భీషణ ప్రతిన చేశారట.
అంటే ఇక్బాల్ జగన్ మాట మీదనే హిందూపురంలో తన హవా కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. మరి నవీన్ నిశ్చల్ కి అబ్దుల్ ఘనీకి కూడా జనాల్లో బాగానే పలుకుబడి ఉంది. ముగ్గురు నాయకులూ ఒక్కటి అయితే కచ్చితంగా గెలిచి తీరుతారు అని అంటున్నారు. కానీ ఈ ముగ్గురూ కలిసే అవకాశాలు అయితే లేవు అని పెద్దిరెడ్డికి బోధపడింది. దాంతో ఈ పంచాయతీని జగన్ ముందే పెట్టి తేల్చాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి అన్నీ ఉన్నా అయిదవతనం లేనట్లుగా అధికారం ఉంది, నాయకులు ఉన్నారు కానీ వర్గ పోరు మూలంగా హిందూపురంలో వైసీపీ పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది అంటున్నారు.