Begin typing your search above and press return to search.
వైసీపీని వదిలేసి కొట్టుకుంటున్న టీడీపీ, జనసేన
By: Tupaki Desk | 5 April 2021 7:30 AM GMTసాధారణంగా ప్రతిపక్షాల ఫైట్ ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీపైనే ఉంటుంది. కానీ ఏపీలో ఇదేం విచిత్రమో. అధికార వైసీపీని వదిలేసి ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలు కొట్టుకుంటున్నాయి. కేడర్ వీధిపోరాటాలు చేసుకుంటోందట.. ఇప్పుడీ రెండు పార్టీల ఫైటింగ్ చూసి వైసీపీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారట..
అధికార వైసీపీతో పోరాడకుండా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు తమలో తాము కొట్లాడుకుంటున్నాయి. టిడిపి, జనసేన ఆంధ్రప్రదేశ్‌లోని నంబర్ టూ, నంబర్ త్రీ పార్టీలు. ఇప్పుడివి ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. రెండు పార్టీల్లోని పెద్ద నాయకులు తమ ప్రశాంతతను కొనసాగిస్తుండగా కింది స్థాయి నేతలు మాత్రం వీధిపోరాటాలు చేస్తున్నారు. ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత ట్విట్టర్‌లో ‘# End off TDP’అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసిన జనసేన మద్దతుదారులు దాన్ని హోరెత్తిస్తూ టీడీపీ పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. టీడీపీతో ఫైట్ కు దిగిన జనసేనకు ఆ పార్టీ కూడా గట్టిగానే బదులిచ్చింది.
తాజాగా తిరుపతి ఉప ఎన్నికలో జనసేన పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ నవతరం పార్టీ అభ్యర్థికి ఎన్నికల కమిషన్ కేటాయించడంతో టిడిపి మద్దతుదారులు తమ పగ సాధించారు. ‘ #JSPChapterClose’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో వైరల్ చేశారు.
ఈ రెండు సందర్భాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు ఇరు పక్షాలు చేస్తున్న పోరాటాన్ని చూస్తూ పండుగ చేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు తమలో తాము పోరాడుతున్నాయని.. ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఇది జరగదని.. ప్రతిపక్షాలు వారి వైఫల్యాలను వారే ప్రశ్నించుకుంటూ అధికార పార్టీతో పోటీపడడం లేదని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.ఎప్పటికైనా బలమైన అధికార పార్టీని ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకమవుతాయి. కానీ ఏపీలో మాత్రం అధికార వైసీపీని పక్కనపెట్టి ప్రతిపక్షాలు కొట్టుకుంటూ అవే బలహీనమవుతున్నాయి.
ఈ పరిణామంతో వైసీపీ మరింత బలోపేతం అయ్యే చాన్స్ ఉంది. తమ ఇద్దరి శత్రువుతో పోరాడకుండా ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఏం సాధిస్తాయని పలువురు హితవు పలుకుతున్నాయి. ఇలానే రాబోయే రోజుల్లో సాగితే వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకే అధికారం దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పర్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు మాత్రమే ఆ పార్టీని ఓడించవచ్చని అంటున్నారు.