Begin typing your search above and press return to search.

ప్రియురాలితో గొడవ..: రూ.40 కోట్ల ధ్వంసం..: ఏం చేశాడంటే..?

By:  Tupaki Desk   |   7 Jun 2022 11:30 AM GMT
ప్రియురాలితో గొడవ..: రూ.40 కోట్ల ధ్వంసం..: ఏం చేశాడంటే..?
X
ప్రేమ జీవితాన్ని నిలబెడుతుంది .. అదే ప్రేమ ఒక్కోసారి నాశనం కూడా చేస్తుంది.. ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించిన ఓ వ్యక్తి .. తన ప్రియురాలి కోసం కోట్ల రూపాయల పురాతన వస్తువులను ధ్వంసం చేశాడు. ప్రియురాలిపై ఉన్న కోపాన్ని మ్యూజికం వస్తువులపై చూపించడంతో ఏన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్న అవి ఇప్పుడు కనిపించకుండా పోయాయి.

ఆ ప్రియుడు చేసిన నిర్వాకంతో పురాతన శాఖ ఏకంగా రూ.40 కోట్లు నష్టపోయింది. ప్రియురాలిపై ఉన్న కోపంతో ఆ యువకుడి చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..?

అమెరికాకు చెందిన బ్రియాన్ ఫెర్నాండేజ్ అనే వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉంటే ఈ న్యూస్ ఉండేది కాదు. ప్రేమించిన అమ్మాయితో బ్రియాన్ గొడవ పడ్డాడు. అయితే ఆమెపై వచ్చిన కోపాన్ని పురాతన వస్తువులపై తన ప్రతాపాన్ని చూపించాడు.

డల్లాస్ లోని మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో అతి పురాతనమైన వస్తువులు ఉన్నాయి. వీటిని భద్రంగా కాపాడుతూ వస్తున్నారు. కానీ బ్రియాన్ ఈ మ్యూజయంలోకి చొరబడ్డాడు. మ్యూజియంలో ఉన్న కళాఖండాలన్నింటిని ధ్వంసం చేస్తూ వచ్చాడు.

ఇందులో ఆరవ శతాబ్దపు గ్రీకు విగ్రహం, 450 బీసీ నాటి కుండతో పాటు విలువైన కళాఖండాలున్నాయి. అంతేకాకుండా కైలిక్స్ మెరాకిల్స్, నెమియన్ లయన్ విగ్రహాలున్నాయి. ఈ లయన్ విగ్రహం విలువ రూ.77 లక్షలు. అయితే ఇదే మ్యూజియంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మోనాలిసా పెయింటింగ్ విధ్వంసానికి కొన్ని రోజుల ముందు ప్రయత్నించారు. ఓ సందర్శకుడు మోనాలిసా పెయింటింగ్ పై కేకు విసిరాడు. అయితే తాజాగా బ్రియాన్ ఈ పెయింటింగ్ జోలికి వెళ్లకపోవడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.

సీసీ కెమెరాల ఆధారంగా బ్రియాన్ ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో బ్రియాన్ చెప్పిన సమాధానంపై పోలీసులు షాక్ తిన్నారు. తన ప్రియురాలితో గొడవ పడ్డాడట. అది తట్టుకోలేకపోయానని, అందుకే కోపంలో ఇలా కళాఖండాలను ధ్వంసం చేశానని చెప్పుకొచ్చాడు. అయితే మ్యూజియంలోని కళాఖండాలు ధ్వంసం చేసిన బ్రియాన్ మనుషుల జోలికి పోలేదు. దీంతో బ్రియాన్ కు థ్యాంక్స్ అని వారు చెప్పారు. ఎంతో కాలంగా పురాతన కళాఖండాలను రక్షిస్తున్న బ్రియాన్ తన కోపంతో ధ్వంసం చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది.