Begin typing your search above and press return to search.

మోడీతో ఫైట్: యోగిదే పైచేయి?

By:  Tupaki Desk   |   21 Jun 2021 4:30 AM GMT
మోడీతో ఫైట్: యోగిదే పైచేయి?
X
ఉత్తరప్రదేశ్ రాజకీయ ఆటలో యోగినే గెలిచినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఓటమి.. కరోనా లాక్ డౌన్ లో ఏమీ చేయలేదన్న విమర్శలతో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ పై ఆ రాష్ట్రంలో వ్యతిరేకత పెల్లుబుకిందన్న టాక్ ఉంది. దీంతో సందులో సడేమియాలో యూపీ సీఎంగా యోగిని తప్పించాలని మోడీ-షాలు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. ఈ మధ్య యోగిని ఢిల్లీకి కూడా అందుకే పిలిపించారు.

యూపీ సీఎం మార్పుతోపాటు కేబినెట్ ప్రక్షాళన చేయాలని మోడీషాలు భావించారు. మోడీపై దేశంలో వ్యతిరేకత పెల్లుబుకితే ప్రత్యామ్మాయంగా యోగిని ప్రధానిని చేయాలని ఆర్ఎస్ఎస్ సహా బీజేపీ ఆలోచిస్తోందన్న ప్రచారం సాగింది. దీంతో మోడీషాలు ఎలాగైనా సరే యోగిని తొక్కేయాలని ప్లాన్ చేస్తారని అంతా భావించారు.

ఈ క్రమంలోనే ఒకప్పుడు మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఏకే శర్మను యూపీలో ఎమ్మెల్సీని చేశాడు ప్రధాని మోడీ. ఈ క్రమంలోనే అతడికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి యోగి ప్రాధాన్యత తగ్గించాలని చూశాడన్న ప్రచారం సాగింది. యూపీ రాజకీయాల్లో యోగికి చెక్ పెట్టేందుకు ప్రోత్సహించినా యోగి మాత్రం ఏకేశర్మను పక్కనపెట్టారు. ఆర్ఎస్ఎస్ ఏకంగా ఏకే శర్మ యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించి మోడీషాలకు షాక్ ఇచ్చింది.

దీంతో పరోక్షంగా యోగికి చెక్ పెట్టాలన్న మోడీషాలకు ఆర్ఎస్ఎస్-యోగి కలిసి చెక్ పెట్టారన్న ప్రచారం యూపీ వర్గాల్లో సాగుతోంది. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక యోగిదే హవా.. మోడీషాలను ఈ నిర్ణయంతో పక్కనపెట్టేసినట్టే కనిపిస్తోంది.