Begin typing your search above and press return to search.

భారత రక్షణ వ్యవస్థలో ముందడుగు..: తొలి విమానరహిత విమానం..

By:  Tupaki Desk   |   2 July 2022 7:30 AM GMT
భారత రక్షణ వ్యవస్థలో ముందడుగు..: తొలి విమానరహిత విమానం..
X
భారత రక్షణ రంగం కొత్త ఒరవడిని సృష్టించింది. తొలి మానవరహిత యుద్ధవిమానాన్ని ప్రయోగించి సక్సెస్ అయింది. రాబోయే కాలంలో రక్షణ రంగంలో దేశీయంగా బలపడేందుకు భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (డీఆర్ డీవో) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా శుక్రవారం కర్ణాటకలోని చిత్రదుర్గలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి తొలి మానవరహిత యుద్ధ విమానాన్ని ప్రయోగించింది.

ఈ ప్రయోగం విజయవంతం అయినట్లు డీఆర్డీవో ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీంతో రాను రాను మానవరహిత యుద్ధ విమానాలను తయారు చేయడంలో ఇదొక దారి అని పేర్కొంది. ఈ విమానం గురించి వివరాలను డీఆర్డీవో తెలిపింది.

అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ ప్రయోగించిన తొలి మానవ రహిత యుద్ధ విమానం చిన్న టర్బోఫ్యాన్ ఇంజన్ తో రన్ అవుతుంది. బెంగుళూర్ లోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు.

ఈ విమానానికి సంబంధించిన ఎయిర్ ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లైట్ కంట్రోల్, ఏవియానిక్స్ వ్యవస్థలను దేశీయంగా అభివృద్ది చేశారు. ప్రయోగంలో భాగంగా విమానం కచ్చితమన టేకాఫ్, నావిగేషన్, స్మూత్ టచ్ డౌన్ తో విమానం చేరుకుంది. ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తి మోడ్ లో పనిచేస్తోందని డీఆర్డీవో వెల్లడించింది.

భవిష్యత్ లో మరిన్ని మానవరహిత యుద్ద విమానాలను తయారు చేసేందుకు ఇదొక మైలురాయి అని రక్షణ సంస్థ పేర్కొంది. వ్యూహాత్మక రక్షణ వ్యవస్థకు ఇలాంటి ప్రయోగాలు ఎంతో అవసరం అని అన్నారు. ఇక ఈ ప్రయోగంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీవోను ప్రశంసించారు. ఆత్మనిర్బర్ భారత్ తో భాగంగా వ్యూహాత్మక సైనిక వ్యవస్థను రూపొందించేందుకు ఇలాంటి ప్రయోగాలు దోహదపడుతాయన్నారు. త్వరలో డీఆర్డీవో మరిన్ని ప్రయోగాలు చేసి రక్షణ వ్యవస్థను పటిష్టంగా మార్చాలని సూచించారు.

రక్షణ వ్యవస్థలో ఎన్నో అడుగులు వేస్తున్న భారత్ ఇదివరకు విదేశాల నుంచి క్షిపణులను దిగుమతి చేసుకుంటోంది. అయితే భవిష్యత్ లో సొంతంగా వీటిని తయారు చేసుకోవాలన్నలక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా కొత్త కొత్ ప్రయోగాలను చేపడుతోంది. కానీ తాజాగా మానవ రహిత యుద్ధ విమానం ప్రయోగంతో కొత్త ఒరవడిని సృష్టించినట్లయిందని పలువరురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సైనిక వ్యవస్థలో ఎన్నో మార్పులు చేస్తుండగా అటు డీఆర్డీవో సైతం ప్రయోగాలతో ముందుకు వెళ్తోంది.