Begin typing your search above and press return to search.

విజ‌య‌వాడ నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఆ సినీ న‌టుడు పోటీ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   7 Sep 2022 11:14 AM GMT
విజ‌య‌వాడ నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఆ సినీ న‌టుడు పోటీ చేస్తున్నారా?
X
విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ స్థానం నుంచి ఈసారి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున సినీ న‌టుడు నాగార్జున పోటీ చేస్తార‌ని నిన్నటి నుంచి సోషల్ మీడియా లో ప్రచారం ఒకటి మొదలు అయ్యింది . నాగార్జునకు గ‌తం నుంచి వైఎస్సార్ కుటుంబంతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న సంక్షేమ ప‌థ‌కాలు న‌చ్చి వాటికి నాగార్జున ఉచిత ప్ర‌చారం కూడా చేసి పెట్టాడు. ఆ త‌ర్వాత వైఎస్సార్ మ‌ర‌ణించాక ఆ అనుబంధాన్ని వైఎస్ జ‌గ‌న్‌తోనూ నాగార్జున కొన‌సాగిస్తూ వ‌చ్చారు.

కాగా విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ స్థానంలో వైఎస్సార్సీపీ ఇంత‌వ‌ర‌కు గెలుపొంద‌లేదు. 2014, 2019ల్లో రెండుసార్లు వైఎస్సార్సీపీ ఇక్క‌డ ఓడిపోయింది. ఈ రెండుసార్లు టీడీపీ అభ్య‌ర్థి కేశినేని నాని ఎంపీగా గెలుపొందారు. వైఎస్సార్సీపీకి ఇక్క‌డ గ‌ట్టి అభ్య‌ర్థి ల‌భించ‌క‌పోవ‌డ‌మే ఆ పార్టీ ఓట‌మికి కార‌ణ‌మంటున్నారు. 2014లో కోనేరు రాజేంద్ర‌ప్ర‌సాద్ వైఎస్సార్సీపీ త‌ర‌ఫున‌ పోటీ చేశారు. ఈయ‌న రాజ‌కీయ నేత కాదు.. వ్యాపార‌వేత్త‌. జ‌గ‌న్‌కు చెందిన సంస్థ‌ల్లో అక్ర‌మ మార్గాల్లో పెట్టుబ‌డులు పెట్టార‌ని ఈయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇక 2019లో ప్ర‌ముఖ నిర్మాత పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ పోటీ చేశారు. ఈయ‌న కూడా వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఓడిపోయారు. ఈయ‌న స్థానికంగా ఉండే నేత కాదు.. రాజ‌కీయంగానూ చురుకుగా ఉండే వ్య‌క్తి కాదు. ఎన్నిక‌ల చివ‌రి నిమిషంలో సీటు ద‌క్కించుకున్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక మ‌ళ్లీ ఇంత‌వ‌ర‌కు ఏ పార్టీ కార్య‌క్ర‌మంలోనూ క‌నిపించ‌లేదు.

ఈ క్ర‌మంలో రెండుసార్లు ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్న విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో 2024 ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలుపు బాట ఎగుర‌వేయాల‌ని జ‌గ‌న్ కంక‌ణం క‌ట్టుకున్నార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడు నాగార్జున వైపు దృష్టి సారించార‌ని అంటున్నారు.

మ‌రి ఈ నేప‌థ్యంలో నాగార్జున విజ‌య‌వాడ నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేస్తారా అంటే మిలియ‌న్ డాల‌ర్లే ప్ర‌శ్నేన‌ని చెబుతున్నారు.అయితే నాగార్జున కూడా ప‌క్కా బిజినెన్‌మేన్ అని ఆయ‌న బాగా తెలిసిన‌వారు చెబుతుంటారు. అంతేకాకుండా త‌న‌కు ఎవ‌రితో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌నుకుంటే వారితో మాత్ర‌మే ఆయ‌న బాగుంటాడ‌ని చెప్పుకుంటుంటారు. అంత తేలికగా రాజకీయాల్లో అడుగు పెట్టె పర్సన్ కాదు అని అంటుంటారు . మహా అయితే జగన్ మీద అభిమానం తో ఆయన పథకాలకు పబ్లిసిటీ చేసి పెట్టచ్చు తప్పితే రాజకీయాల్లోకి అంత తేలికగా అడుగుపెట్టకపోవచ్చు


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.