Begin typing your search above and press return to search.
'కారు' లో 'మంచు' కురిసిన వేళలో...
By: Tupaki Desk | 11 Nov 2018 12:07 PM GMTమోహన్ బాబు. విలక్షణ నటుడు. తన డైలాగ్ డెలివరీతో తెలుగు సినీ అభిమానులను అలరించిన నటుడు. నటరత్న నందమూరి తారక రామారావుకి అనుంగు అనుచరుడు. ఆయన మీద అభిమానంతోనే తెలుగుదేశం పార్టీకి అభిమానిగా మారారు మోహన్ బాబు. ఆయన అవసరాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభకు కూడా పంపారు. అయితే, అవసరం తీరాక వాడుకుని వదిలేయడం అలవాటున్న చంద్రబాబు నాయుడు ఈ నటుడ్ని కూడా అలాగే నది మధ్యలో వదిలేశారు. దీంతో తెలుగుదేశం పార్టీకి... ఆ మాటకొస్తే రాజకీయాలకే దూరం అయ్యారు మోహన్ బాబు. అయితే తాను ఏమనుకుంటున్నారో కుండబద్దలు కొట్టేలా మాట్లాడే మోహన్ బాబు తన మాటల తూటాలను మాత్రం వదలడం మానలేదు. అంతే కాదు.... ఏం జరిగినా... జరుగుతున్నా.... తనకు ఎలాంటి ఇబ్బంది వస్తుందనుకున్నా లెక్క చేయని మోహన్ బాబు తన వ్యాఖ్యలతో తెలుగు వారిని తన వైపు తిప్పుకోవడం మాత్రం మానలేదు. తెలుగుదేశం పార్టీకి... ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడే మోహన్ బాబు తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో మాత్రం తన మనోగతాన్ని దైవ సన్నిధిలోనే వెల్లడించారు. సంచలనాలకు మారుపేరైన మోహన్ బాబు ఈ ఎన్నికల్లో ఎవరు గెలవాలనుకుంటన్నారో కుండబద్దలు కొట్టారు.
ఫిలిం నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే మోహన్ బాబు తన మనోగతాన్ని వెల్లడించారు. ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి రావాలని తన అభీష్టాన్ని వెల్లడించారు మోహన్ బాబు. ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన మోహన్ బాబుకు ఆ సమయంలో అక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తారసపడ్డారు. సరిగ్గా ఆ సమయంలోనే తుమ్మలను ఆప్యాయంగా కౌగలించుకున్న మోహన్ బాబు " తమ్ముడూ ఈ సారి కూడా మళ్లీ మీరే గెలవాలి" అంటూ తన అభిమతాన్ని చాటుకున్నారు.దీనికి తుమ్మల స్పందిస్తే అన్నా మీ ఆశీర్వాదాలు ఉంటే అలాగే జరుగుతుందని సమాధానం చెప్పారు. గత కొంతకాలంగా మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మోహన్ బాబు ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు భార్య వెరోనిక ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు. దీంతో మోహన్ బాబు వచ్చే ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఇక తెలంగాణలో మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావాలని మోహన్ బాబు మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు.