Begin typing your search above and press return to search.
ఇంతకీ నరసాపురంలో పోటీచేసేదెవరు ?
By: Tupaki Desk | 26 Sep 2022 6:52 AM GMTఇపుడీ విషయంపైనే మిత్రపక్షాల నేతల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు పుణ్యమా అని నరసాపురం పార్లమెంట్ స్థానం బాగా పాపులరైంది. లేకపోతే ఈ లోక్ సభ సీటు గురించి రాష్ట్రంలో పెద్దగా ఎప్పుడూ చర్చలు జరగలేదు. సరే ఇక విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాల్లో ఏ పార్టీ ఇక్కడినుండి పోటీచేస్తుందనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది.
ఎందుకంటే రెండు పార్టీలు కూడా పోటీ చేయబోయేది తమ పార్టీనే అంటే కాదు తమ పార్టీనే అని ప్రచారం చేసుకుంటున్నాయి. ఒక అడుగు ముందుకేసి అభ్యర్ధులను కూడా అనధికారికంగా ప్రచారం చేస్తున్నాయి. దాంతో రెండు పార్టీల్లోని నేతల్లోనే కాదు జనాల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది. మొదటగా ఇక్కడ జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. పోయిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాగబాబే వచ్చే ఎన్నికల్లో కూడా అభ్యర్ధని ప్రచారం జరిగింది.
అయితే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది లేదని స్వయంగా నాగబాబే ప్రకటించారు. దాంతో ఈ సీటులో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురాజు పోటీచేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. రాజు కూడా వచ్చే ఎన్నికల్లో తాను నరసాపురం నుండే పోటీచేస్తాను కానీ ఏ పార్టీ అనేది చెప్పను అని సస్పెన్సు వదిలారు.
దాంతో తమపార్టీ నుండే రఘురాజు పోటీలోకి దిగబోతున్నట్లు జనసేన వర్గాలే చెప్పాయి. దాంతో అందరు ఇదే నిజమని అనుకున్నారు.
ఇపుడు హఠాత్తుగా నరసాపురం నుండి బీజేపీ పోటీ చేయబోతోందనే ప్రచారం జోరందుకున్నది. ఈ మధ్యనే చనిపోయిన కృష్ణంరాజు తమ్ముడి కొడుకు, సినీ నటుడు ప్రభాస్ తమ్ముడు ప్రభోద్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది.
స్వయంగా కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ నరసాపురంలో పోటీ చేయమని ప్రభాస్ కు చెప్పినట్లు ఆయన ప్రభోద్ పోటీచేస్తారని బదులిచ్చినట్లు ప్రచారంలో ఉంది. మరిద్దరిలో పోటీచేయబోయేదెరనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.