Begin typing your search above and press return to search.
తిరుమలలో సినీ నటి రచ్చ రచ్చ!
By: Tupaki Desk | 5 Sep 2022 11:35 AM GMTపవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సినీ నటి ఒకరు రచ్చ రచ్చ చేసింది. బాలీవుడ్ సినిమాల్లో నటించిన అర్చనా గౌతమ్ తనకు బ్రేక్ దర్శనం టికెట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తూ గలాటా సృష్టించింది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చిన తనతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది. తాను డబ్బులు చెల్లించినా బ్రేక్ దర్శనం టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పెద్దగా ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది.
దీంతో ఆమెను సెల్ఫీ వీడియో తీయకుండా టీటీడీ సిబ్బంది అడ్డుకున్నారు. టీటీడీ ఈవో కార్యాలయంలోని సిబ్బంది తనను కొట్టే ప్రయత్నం చేశారని అర్చనా గౌతమ్ ఆరోపిస్తోంది. తనతో తప్పుగా ప్రవర్తించినవారిని దేవుడు వదిలిపెట్టడని శిక్షిస్తాడని కన్నీటి పర్యంతం అయ్యింది.
భారతదేశంలోని హిందూ ధార్మిక స్థలాలు దోపిడీ స్థలాలుగా మారాయని అర్చనా గౌతమ్ నిప్పులు చెరిగింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో వీడియో పోస్టు చేసింది.
వీఐపీ దర్శనం పేరుతో ఒక వ్యక్తి నుంచి రూ.10,500 వసూలు చేస్తున్నారని.. ఈ దోపిపికి అడ్డుకట్ట వేయాలని అర్చనా గౌతమ్ కోరింది. తనతో తప్పుగా వ్యవహరించిన టీటీడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. కాగా ఈవో కార్యాలయంలో ఆమె సెల్ఫీ వీడియో తీసేందుకు యత్నించగా.. టీటీడీ సిబ్బంది అడ్డుకునే యత్నం చేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది
అయితే ఘటనపై టీటీడీ వాదన మరోలా ఉంది. వినయకచవితి రోజు జరిగిన గొడవ తాలూకా వీడియోని.. ఆమె ఈ రోజు పోస్ట్ చేసిందని టీటీడీ చెబుతోంది. ఓ ప్రజాప్రతినిధి సిఫార్స్ లేఖని ఆమె తెచ్చిందని.. ఆ లెటర్ సమయం ముగిసిపోవడంతో బ్రేక్ దర్శనం ఇవ్వలేదని టీటీడీ సిబ్బంది చెబుతున్నారు. కాగా అర్చనా గౌతమ్ బాలీవుడ్‌లో నటిగా కొనసాగుతూనే … ఉత్తరప్రదేశ్ లోని హస్తినాపూర్ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయింది.
కాగా 25 ఏళ్ల అర్చనా గౌతమ్ గతంలో మిస్ ఉత్తరప్రదేశ్ టైటిల్‌ను గెలుచుకుంది. బాలీవుడ్ లో గ్రేట్ గ్రాండ్ మస్తీ, హసీనా పార్కర్, భారత్ కంపెనీ, జంక్షన్ వారణాసి వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో అర్చనా గౌతమ్ నటించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.