Begin typing your search above and press return to search.

జ‌న‌సేన వైపు ప్ర‌ముఖ క‌మెడియ‌న్ చూపు!

By:  Tupaki Desk   |   21 Sep 2022 5:33 AM GMT
జ‌న‌సేన వైపు ప్ర‌ముఖ క‌మెడియ‌న్ చూపు!
X
తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఒక ప్రముఖ క‌మెడియ‌న్ జ‌న‌సేన పార్టీ వైపు చూస్తున్నారా అంటే అవున‌నే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ఒక పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ అధినేత ప‌లుమార్లు ఆయ‌నను పిలిపించుకుని మాట్లాడారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ముందు, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ముందు ఆ క‌మెడియ‌న్‌ను పార్టీ అధినేత స్వ‌యంగా త‌న ద‌గ్గ‌ర‌కు పిలిపించుకుని మాట్లాడటంతో ఆయ‌న‌కు ఏదో పెద్ద ప‌ద‌వి ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అందులోనూ ఈ క‌మెడియ‌న్ 2019 ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా కూడా ప్ర‌చారం చేశారు. ఈ క్ర‌మంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహ బంధాన్ని విస్మ‌రించి జ‌న‌సేన పార్టీకే కాకుండా వేరే పార్టీకి ప్ర‌చారం చేశారు.

అయితే ఇప్పుడు ఆ క‌మెడియ‌న్ ఉన్న పార్టీలో ఆయ‌న‌కు త‌త్వం బోధ‌ప‌డింది. కొన్ని లెక్క‌ల ప్ర‌కారం ద‌గ్గ‌ర‌కు తీయ‌డం, ఆ త‌ర్వాత వాడుకుని వ‌దిలేయ‌డంలో దిట్టగా పేరున్న ఆ పార్టీ అధినేత త‌న పార్టీలో ఉన్న క‌మెడియ‌న్‌కు ఏ ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ముందు రాజ్య‌స‌భ అన్నారు.. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ అన్నారు. .ఆ త‌ర్వాత కేబినెట్ హోదాతో ఏదో కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి అన్నారు.. ఇలా ఏదీ కాలేదు.

దీంతో జీవితంలో ఒక్క‌సారైనా ఎమ్మెల్యే కావాల‌న్న త‌న వాంఛ‌ను తీర్చుకోవ‌డానికి జ‌న‌సేన పార్టీ వైపు చూస్తున్నారు. అందులోనూ త‌న సొంత జిల్లా తూర్పుగోదావ‌రిలో జ‌న‌సేన పార్టీ ఇప్పుడు అత్యంత బ‌లంగా ఉంద‌నే వార్త‌లు ఆ క‌మెడియ‌న్ చెవిన ప‌డ్డాయి.

తాను ప్ర‌స్తుతం ఉన్న పార్టీతో ఢీ అంటే ఢీ అన‌గ‌ల స్థితిలో ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ జిల్లాలో చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే సీట్లు గెల‌వ‌గ‌ల‌ద‌నే అంచనాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ నుంచి పోటీ చేసే యోచ‌న‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అందులోనూ ఆ క‌మెడియ‌న్‌ది రాజ‌మండ్రి. ఇక్క‌డ జ‌న‌సేన ప్ర‌భావం బ‌లంగా ఉంది. దీంతో న‌గ‌రం ప‌రిధిలోనే ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి లేదా తూర్పుగోదావ‌రి జిల్లాలో మ‌రేదైనా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే యోచ‌న‌లో ఆ క‌మెడియ‌న్ ఉన్నార‌ని అంటున్నారు.

అయితే గ‌ట్టి స్నేహ సంబంధాన్ని కూడా లెక్క‌చేయ‌కుండా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న అభిమానుల ఆగ్ర‌హానికి కూడా ఈ క‌మెడియ‌న్ గుర‌య్యారు. మ‌రోవైపు అప్ప‌టి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అత‌డిని త‌న సినిమాల దూరం పెట్టారు. 2019 ఎన్నిక‌లప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్ సినిమాల్లో ఆ క‌మెడియ‌న్ కు అవ‌కాశాలు కూడా ప‌వ‌న్ ఇవ్వ‌డం లేదు. అంత‌కుముందు ప్ర‌తి ప‌వ‌న్ సినిమాలోనూ ఆ న‌టుడు క‌నిపించేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జ‌న‌సేన నుంచి పోటీ చేయ‌డానికి ఆ క‌మెడియ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో వేచిచూడాల్సిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.