Begin typing your search above and press return to search.

కేటీఆర్ ని 10వేల మంది రౌండ‌ప్ చేస్తారు!

By:  Tupaki Desk   |   4 April 2019 4:40 PM GMT
కేటీఆర్ ని 10వేల మంది రౌండ‌ప్ చేస్తారు!
X
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ వార‌సుడు సాయికిర‌ణ్ యాద‌వ్ పొలిటిక‌ల్ వార్ లో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. సికింద్రాబాద్ లోక్‌ సభ స్థానం నుంచి ఆయనను టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా సాయికిర‌ణ్ యాద‌వ్ ప‌లువురు టాలీవుడ్ పెద్ద‌లు స‌హా - సినీప‌రిశ్ర‌మ 24 శాఖ‌ల కార్మికుల్ని క‌లుస్తూ ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. త‌ల‌సాని ఇండ‌స్ట్రీ ఆత్మ బంధువు నినాదాన్ని సాయికిర‌ణ్ యాద‌వ్ ప్ర‌చారాస్త్రంగా ఉప‌యోగించ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నేడు హైద‌రాబాద్ లో జ‌రిగిన ఫిలిం ఫెడ‌రేష‌న్ స‌మావేశంలో ప‌లువురు సినీపెద్ద‌లు సాయికిర‌ణ్ యాద‌వ్ కి 24 శాఖ‌ల కార్మికుల అండ‌దండ‌లు ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు.

ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు కొమ‌ర వెంక‌టేష్ మాట్లాడుతూ.. టాలీవుడ్ లో సినిమా రిలేటెడ్ గా 2ల‌క్ష‌ల మంది ఉపాధి పొందుతున్నారు. దాదాపు 30 వేల కుటుంబాలు ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్నాయి. హైద‌రాబాద్ బేస్డ్ గా వీళ్లంతా ప‌ని చేస్తున్నారు. వీళ్ల‌లో చాలా ఓట్లు త‌ల‌సాని వార‌సుడికి ప‌డ‌తాయ‌ని వ్యాఖ్యానించారు. ఆ మేర‌కు తాము ప్ర‌చారం ప‌రంగా సాయం చేస్తామ‌ని అన్నారు. ఇదివ‌ర‌కూ జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లు స‌హా అన్నిటా తాము తెరాస‌కు అండ‌గా నిలిచామ‌ని తెలిపారు. త‌ల‌సాని వార‌సుడికే ఎందుకు అండ‌గా నిలుస్తున్నారు? అంటే త‌మ‌కు అన్ని వేళ‌లా త‌ల‌సాని అందుబాటులో ఉండ‌డ‌మే కార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు.

ఏప్రిల్ 6 ఉగాది ఫ‌ర్వ‌దినాన తెరాస ఐటీ మంత్రి కేటీఆర్ ఇందిరా న‌గ‌ర్ గ్రీన్ బావార్చీ ప‌రిస‌రాల్లో భారీగా రోడ్ షో నిర్వ‌హిస్తున్నార‌ని.. ఈ రోడ్ షోకి ఫెడ‌రేష‌న్ త‌ర‌పున దాదాపు 10 వేల మంది కార్మికులు ఎటెండ‌వుతున్నార‌ని తెలిపారు. ఈ స‌భ‌కు సాయికిర‌ణ్ యాద‌వ్ - దానం త‌దిత‌రులు ఎటెండ‌వుతున్నార‌ని వెల్ల‌డించారు. సినీప‌రిశ్ర‌మ యావ‌త్తూ తెరాస‌కు అండ‌గా నిలుస్తుంద‌ని - సినిమావాళ్ల బ‌లం ఏంటో చూపిస్తామ‌ని అన్నారు. ఇదే వేదిక‌పై ద‌ర్శ‌క‌సంఘం అధ్య‌క్షుడు ఎన్.శంక‌ర్ మాట్లాడుతూ.. తెరాస పార్టీ 16 ఎంపీ సీట్లకు పోటీ చేస్తోంది. పార్ల‌మెంట్ లోనూ మ‌న బాణి వినిపించేందుకు కేసీఆర్ గారికి అవ‌కాశం ల‌భించ‌నుంది. మ‌న‌మే గెలిపించుకుందామ‌ని వ్యాఖ్యానించారు. 24 శాఖ‌ల కార్మికుల స‌మ‌స్య‌లు వినేందుకు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి అందుబాటులో ఉన్నార‌ని .. సినిమా వాళ్ల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయ‌ని అన్నారు.