Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ ఎపిసోడ్ లో మరో పేరు బయటకు
By: Tupaki Desk | 21 Feb 2017 7:18 AM GMTప్రముఖ మలయాళ నటి కిడ్నాప్.. లైంగిక దాడి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉదంతంలో ఒక సినీ హీరోకు సంబంధం వచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో.. మరో సినీ ప్రముఖుడికి సంబంధాలున్న విషయం తెరపైకి వచ్చి సంచలనంగా మారింది. నటిని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి పాల్పడిన రోజు రాత్రి.. ఈ కేసుతో సంబంధం ఉన్న రౌడీ షీటర్ సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునితో ఒక ప్రముఖ నిర్మాత ఆంటో జోసెఫ్ మాట్లాడిన విషయం బయటకు వచ్చింది.
ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్టు ఉల్లేక్ ఎన్పీ ఫేస్ బుక్ లో ప్రశ్నిస్తూ.. ‘‘నిర్మాత అంటో జోసెఫ్ ను ఇంకా పోలీసులు ఎందుకు ప్రశ్నించటం లేదు. చివరిసారిగా అతనితో మాట్లాడిన తర్వాతే పల్సర్ సుని తన ఫోన్ ను స్విచ్ఛాప్ చేసినట్లుగా కాల్ రికార్డ్స్ తోపాటు.. పోలీసులు ధ్రువీకరిస్తున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ జర్నలిస్టు వ్యాఖ్యలతో అయినా పోలీసులు రియాక్ట్ అవుతారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
హీరోయిన్ పై జరిగిన దారుణం చూస్తే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక అంతుచిక్కని విషయం ఏదో ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇంత కసిగా ఎందుకు వ్యవహరించారు? ఆమెపై వారు అంతగా ఎందుకు పగబట్టారు? అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి. బాధితురాలైన హీరోయిన్ తో కేరళరాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ ఫోన్లో మాట్లాడి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒకవైపు ముఖ్యమంత్రి మాటలు ఇలా ఉంటే.. మరోవైపు.. ప్రధాన నిందితులతో సంబంధాలున్నట్లుగా ఆధారాలు లభిస్తున్నా.. సినీ ప్రముఖుల్ని పోలీసులు ఎందుకు ప్రశ్నించటం లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/