Begin typing your search above and press return to search.
రెబల్ స్టార్‌కు ఘనంగా అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు!
By: Tupaki Desk | 11 Sep 2022 8:41 AM GMTవృద్ధ్యాప్య సమస్యలతో కన్నుమూసిన రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణంరాజుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు
తనకు అత్యంత ఆప్త మిత్రుడు, మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు.. అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది.
కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్నిజూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నుంచి, తూర్పుగోదావరి జిల్లాలోకి కాకినాడ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. 1999 నుంచి 2004 నుంచి నాటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి మంత్రివర్గంలో వివిధ శాఖలకు సహాయ మంత్రిగానూ కృష్ణంరాజు పనిచేశారు. 2009లో ప్రముఖ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేశారు.