Begin typing your search above and press return to search.
మొత్తానికి ఫెయిల్యూర్ ను అంగీకరించిన పవన్
By: Tupaki Desk | 19 Nov 2020 2:34 PM GMTఎన్నికలైన ఏడాదిన్నర తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాన్ తన ఫెయిల్యూర్ ను అంగీకరించారు. ‘జనబలాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవటంలో మనం విఫలమయ్యాం’ అని మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ప్రకటించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసైనికులతో జరిగిన సమావేశంలో పవన్ తన వైఫల్యాన్ని అంగీకరించారు. అసలు తాను పార్టీ పెట్టిందే అధికారం కోసమని కూడా అంగీకరించారు.
నిజానికి ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా, పార్టీ పెట్టినా అధికారం కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ పవన్ మాత్రం ఒకసారి తనకు అధికారం అవసరం లేదన్నారు. మరోసారి అధికారం కోసం 25 ఏళ్ళయినా ఓపిగ్గా నిరీక్షిస్తానన్నారు. ఇంకోసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలన్న ఆలోచన తనకు లేదని చెప్పారు. అధికారం కోసమే ఎవరైనా జనసేనలో చేరితే అలాంటివాళ్ళు వెంటనే ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోవచ్చంటు హెచ్చరించారు. ఇలా ఒక్కోసారి ఒక్కోవిధంగా మాట్లాడి జనసైనికులనే కాదు జనాలను కూడా అయోమయంలోకి నెట్టేశారు.
హోలు మొత్తం మీద గమనించాల్సిందేమంటే ఎవరు పార్టీ పెట్టినా ప్రజల పక్షం వహిస్తేనే వాళ్ళకు నమ్మకం వస్తుంది. కానీ పవన్ మాత్రం చాలా విచిత్రంగా వ్యవహరించారు. ఏ దశలో కూడా జనాల్లో నమ్మకం కల్పించలేకపోయారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు ప్రయోజనాలను రక్షించటమే టార్గెట్ గా పనిచేస్తున్నారనే విషయం జనాల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయింది. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షమంటే అధికారపక్షాన్ని టార్గెట్ గా చేసుకుంటుంది. కానీ ఏపిలో మాత్రం ప్రతిపక్షంగా ఉన్న జనసేన సాటి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని ప్రతిరోజు టార్గెట్ చేయటం ఆశ్చర్యమేసింది.
పైగా జనసేన నిర్వహించిన ర్యాలీల్లో కానీ ఎన్నికల సభల్లో కానీ ఎట్టి పరిస్ధితుల్లోను జగన్ కు అధికారం దక్కనిచ్చేది లేదంటు పవన్ పదే పదే మాట్లాడటంతో జనాలు ఆశ్చర్యపోయారు. ఏ పార్టీ అయినా తనకు ఓట్లేయమంటుంది కానీ పవన్ మాత్రం వైసీపీ ఓట్లేయద్దని ఓటర్లకు బహిరంగంగా చెప్పటంతోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. దాని ఫలితంగానే పవన్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు కూడా జనసేనని కాదని వైసీపీకి ఓట్లేశారు. జనాల నమ్మకాన్ని కోల్పోయిన పార్టీకి చివరకు ఏ గతి పడుతుందో ఎన్నికల ఫలితాలే సాక్ష్యం. సరే కారణాలు ఏవైనా కానీండి మొత్తానికి ఇంతకాలానికైనా పవన్ తన వైఫల్యాన్ని అంగీకరించారు.