Begin typing your search above and press return to search.

మీ మాటలకు అప్పులకు పొంతన లేదు మంత్రిగారు అంటున్న జనం

By:  Tupaki Desk   |   27 July 2022 8:30 AM GMT
మీ మాటలకు అప్పులకు పొంతన లేదు మంత్రిగారు అంటున్న జనం
X
మ‌ద్య నిషేధం అన్న‌ది జగన్ హామీ. ప్రస్తుతం అది అమ‌ల్లోకి రాలేదు. పోనీ మద్యం ఆదాయం వల్లే మా ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నాం అని నేరుగా అయినా ఒప్పుకోవ‌చ్చు కదండీ అని అంటోంది విప‌క్షం.

పాద‌యాత్ర సంద‌ర్భంగా జ‌గ‌న్ ఇచ్చిన హామీ ఇప్పుడు గాల్లో ఉంది. పోనీ నిషేధం లేక‌పోయినా నియంత్ర‌ణ అయినా ఉందా అంటే అదీ లేదు. దీంతో ప్ర‌భుత్వం దీన్నొక ఆదాయ మార్గంగానే చూస్తుందన్న‌ది నిన్న‌టి వేళ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర చెప్పిన మాట‌ల ఆధారంగా తేలిపోయింది.

ఈ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మ‌రియు పాత కాలం నాటి అప్పులు అన్నీ చూసుకుంటే ఇప్ప‌టికే అప్పుల వాటా ప‌రిధి దాటిపోయింది. మూడేళ్ల‌కే ల‌క్షా 15 వేల కోట్ల రూపాయ‌ల అప్పులు తెచ్చార‌నీ తేలిపోయింది. ఇప్పుడున్న లెక్క‌ల ప్ర‌కార‌మే చూసుకుంటే మొత్తం అప్పు మూడు ల‌క్ష‌ల కోట్ల‌కు పైగానే అన్న‌ది తేలిపోయింది. దేశంలో త‌మ క‌న్నా ఎ క్కువ అప్పులు చేసిన తమిళ నాడు ను ఏమీ అన కుండా, ఏపీ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు ఏపీ బీజేపీ నాయ‌కుల‌ను ప్ర‌శ్నిస్తూ వస్తున్నారు.

మ‌త్తు పానీయాల‌పై వ‌చ్చే ఆదాయాన్నే ఆధారంగా చేసుకుని, అక్క‌డ వ‌సూలు ప‌న్న‌లు ఇత‌ర లె క్క‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేష‌న్ పేరిట రుణాలు తీసుకుని వ‌చ్చాం అని నిన్న‌టి వేళ కూడా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న అంగీక‌రించారు.

అనూహ్య స్థాయిలో ద్ర‌వ్య‌లోటు కార‌ణంగానే ఈ ప‌ని చేయాల్సి వ‌చ్చిందా.? అంటే దీనికి మంత్రి చెబుతున్నా స‌మాధానం చూస్తే కాస్త ఆలోచించాల్సిందే ! గత ప్ర‌భుత్వ హ‌యాంలో అంటే 2014 - 1 5 లో ద్ర‌వ్య‌లోటు 3.95 శాతం ఉంటే తాము 2021 - 22 దానిని మూడు శాతానికి త‌గ్గించామ‌ని చెబుతున్నారు. ఇంత‌గా ద్ర‌వ్య‌లోటు త‌గ్గించ‌గ‌లుగుతున్న‌వారు అప్పులెందుకు చేస్తున్నార‌ని ? అదేవిధంగా బాబు హయాంలో రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి అన్న‌ది 11 శాతం ఉంటే, త‌మ హ‌యాంలో అది 18 శాతానికి చేరుకుంద‌ని కూడా వీరంటున్నారు.

అంటే రాష్ట్రానికి పురోగ‌తి ఉన్న‌ట్లేన‌ని ఒప్పుకున్నారు క‌దా ! అ లాంట‌ప్పుడు అప్పులు ఎందుకు ? ద్ర‌వ్య‌లోటు త‌గ్గించిన‌ప్పుడు, స్థూల ఉత్ప‌త్తి పెంచిన‌ప్పుడు , గ్రోత్ రేట్ బాగుంద‌ని చెబుతున్న‌ప్పుడు అప్పులెందుకు రాజేంద్రా అని ప్ర‌శ్నిస్తున్నాయి విప‌క్షాలు. అం టే చెబుతున్న లెక్క‌లు అయినా త‌ప్పులు అయి ఉండాలి లేదా మ‌ద్యంపై వ‌చ్చే ఆదాయమే ప్రామాణికం అని ఒప్పుకోనైనా ఒప్పుకోవాలి.. కానీ ఈ రెండూ ఆయ‌న అంగీక‌రించ‌డం లేద‌ని విప‌క్షం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.