Begin typing your search above and press return to search.
ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ .... మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్...?
By: Tupaki Desk | 1 May 2022 12:30 AM GMTఆయన కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన మంత్రి గారు. వైఎస్సార్ సమకాలీకుడు. ఆయన ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు. ఇక కాంగ్రెస్ లో ఉన్నపుడు ఆయన వైఎస్సార్ నేస్తంగా ఉన్నారు. అలాగే ఆయన ప్రత్యర్ధిగానూ అదే పార్టీలో ఉన్నారు. ఇక జగన్ కాంగ్రెస్ వీడి బయటకు వచ్చినపుడు డీఎల్ ఆయన మీద కడప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
రాజకీయ చిత్రం కాకపోతే మరేమిటి అన్నట్లుగా 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. తన సీనియారిటీకి ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందని, అదృష్టం బాగుంటే మంత్రి కూడా కావచ్చు అని డీఎల్ ఆశించారు. అయితే జగన్ ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇక ఆయనకు పట్టున్న మైదుకూరు నియోజకవర్గంలో రెండు సార్లు వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా ఎస్ రఘురామిరెడ్డి ఉన్నారు. ఆయన ఉండగా డీఎల్ కి టికెట్ దక్కడం కష్టం. ఎమ్మెల్సీగా ఇక చాన్స్ లేదు.
దాంతో డీఎల్ కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఆయన పేరుకు వైసీపీలో ఉన్నా సరైన టైమ్ చూసి వేరే పార్టీలలోకి జంప్ చేయాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఆ మధ్య కాలంలో అధికార పార్టీకి వ్యతిరేకగా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు.
ఇపుడు చూస్తే మరోసారి గట్టిగానే ఆయన మాట్లాడారు. దానికి ఆయన తెలంగాణా మంత్రి కేటీయార్ చేసిన కామెంట్స్ ని ఆసరాగా చేసుకున్నారు. కేటీయార్ అన్న మాటలు అక్షర సత్యాలు. ఏపీలో విద్యుత్, నీళ్ళు లేవు, రోడ్లు దారుణమని ఆయన విమర్శించారు. అంతటితో ఆగకుండా వైసీపీ పాలకులు మూడేళ్ళలో ఏపీని సర్వనాశనం చేశారు అని ఘాటు కామెంట్స్ చేశారు. ఏపీని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారు అని కూడా డీఎల్ మండిపడ్డారు.
ఇక ఏపీలో అప్రకటిత విద్యుత్ కోతలు ఉన్నాయని అన్నారు. ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీని కూడా తొందరలో పెడతారు అని కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. మొత్తంగా చూస్తూంటే డీఎల్ మరోసారి జగన్ మీద తన మంటను మాటల ద్వారా వ్యక్తం చేశారు అనుకోవాలి. జగన్ సొంత జిల్లా నుంచే ఇంతటి ధిక్కార స్వరం, అది కూడా సొంత పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నుంచి రావడం అంటే వైసీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.