Begin typing your search above and press return to search.

ఆర్థిక సంవత్సరం పొడగింపు .. కీలక ప్రకటన చేసిన కేంద్రం ?

By:  Tupaki Desk   |   31 March 2020 8:30 AM GMT
ఆర్థిక సంవత్సరం పొడగింపు .. కీలక ప్రకటన చేసిన కేంద్రం ?
X
కరోనా వైరస్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. ప్రపంచ దేశాలని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ ..ఇండియా లోకి కూడా ప్రవేశించడంతో దీన్ని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. అదేమిటి అంటే .. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్‌ వరకూ
కొనసాగనుంది అని, అయితే , ఈ వార్తలకి తాజాగా కేంద్రం చెక్ పెట్టింది.

ఇలాంటి వదంతులను నమ్మవద్దంటూ పీఐబీ ఇండియా ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. యథావిధిగా ఈ ఆర్థిక వత్సరం 31.3.2020 తో ముగుస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించ లేదని, మార్చి 31 తో ముగియనున్నట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. భారత స్టాంప్ చట్టంలో చేసిన మరికొన్ని సవరణలకు సంబంధించి 2020 మార్చి 30న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తప్పుగా పేర్కొనబడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సంవత్సరం పొడగింపు ఆలోచనలేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

సాంప్రదాయకంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1తో ప్రారంభమై ఆ తదుపరి ఏడాది మార్చి 31తో పూర్తవుతుంది. కరోనా కల్లోలం కారణంగా కేంద్రం భారత్‌ ఆర్థిక సంవత్సరాన్ని 3 నెలలు పొడిగించిందంటూ వార్తలు వెలువడ్డాయి. 2020 ఏప్రిల్‌ నుంచీ కాకుండా 2020 జూలై 1వ తేదీ నుంచీ ప్రారంభమవుతుందని సూచించాయి. అయితే ఈ అంచనాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.