Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు మైనారిటీ మంత్రం ఫలించేనా..?

By:  Tupaki Desk   |   11 Dec 2022 6:30 AM GMT
చంద్ర‌బాబు మైనారిటీ మంత్రం ఫలించేనా..?
X
మైనారిటీల‌కు ఎవ‌రు ఏం చేశారనేది కాదు. మైనారిటీలు ఎవ‌రివైపు ఉన్నార‌నేది చూడాలి. కానీ, చంద్ర‌బాబు తాజా మైనారిటీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం అయితే చేశారు. ఇది మంచిదే. ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, చంద్ర‌బాబు హ‌వా జోరుగా ఉన్న 2014 ఎన్నిక‌ల్లోనే ఆ పార్టీకి ఒక్క‌టంటే .. ఒక్క మైనారిటీ సీటు కూడా ద‌క్క‌లేదు. అప్ప‌ట్లోనే మైనారిటీ శాఖ‌ను ఏర్పాటు చేయ‌లేక పోయారు.

ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి జ‌లీల్ ఖాన్‌ను తీసుకుని మైనారిటీ శాఖ‌ను అప్పగించాల‌ని చూసినా ..క‌లిసి రాలేదు. ఇక‌, ఇప్పుడు ఈ మూడున్న‌రేళ్ల కాలంలో పార్టీ ప‌రంగా చూసుకున్నా..మైనారిటీల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. పోనీ.. పార్టీప రంగా వారికి ప్రాధాన్యం క‌ల్పించి ఉన్నా.. మైనారిటీలో విశ్వాసం పెరిగి ఉండేది. కానీ అలాకూడా చేయ‌లేదు. అయితే, మైనారిటీల‌కు తాము 4 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇచ్చామ‌ని చెప్పుకొస్తున్నారు.

వాస్త‌వానికి మైనారిటీల‌కు వైఎస్ ప్ర‌భుత్వం 4 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే.. టీడీపీనే హైకోర్టులో వ్యాజ్యం వేసి.. దీనిని కొట్టేసేలా చేసింద‌నే ధుష్ప్రచారాన్ని ఇతర పార్టీలు టీడీపీపై రుద్దాయి. నిజానికి ఆ వ్యాజ్యం వేసింది టీడీపీ కాదు, అయినా ఆరోపణలపై కౌంటర్ ఇవ్వకపోవడంతో ఆ వ‌ర్గంలో ఇది మైనస్ అయ్యింది.

అందుకే అప్ప‌టి నుంచి ఆ ఓటు బ్యాంకు పూర్తిగా వైఎస్ వైపు మ‌ళ్లింది. అయితే, చంద్ర‌బాబు హ‌యాంలో కొన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టారు. దుల్హ‌న్‌, దుకాణ్ ఔర్ మ‌కాన్‌.. హ‌జ్ యాత్ర‌కు నిధులు వంటివి ఇచ్చారు. అయితే, అవి కూడా అనుకున్నసరైన ప్రచారం లేక మైలేజీ తెచ్చిపెట్ట‌లేక పోయాయి.

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో మైనారిటీ ఓటు బ్యాంకును కైవ‌సం చేసుకునే వ్యూహాత్మ‌క నాయ‌కుల‌కు చోటు ఇవ్వ‌క‌పోవ‌డం ఇక్క‌డ ప్ర‌ధాన మైన‌స్‌గా మారిపోయింది. దీనిని విస్మ‌రించి.. ఇప్పుడు మైనారిటీల కోసం తాము ఏదో చేశామ‌ని చెప్పుకొన్నా..

అది ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుంద‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే. ముందుగా, మైనారిటీల ఓట్ల‌ను ఎలా త‌మ‌వైపు తిప్పుకోవాల‌నే విష‌యంపై చంద్ర‌బాబు దృష్టి పెట్టి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌కు అవ‌కాశం ఇప్పిస్తే మంచిద‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.