Begin typing your search above and press return to search.

ఒక్కరోజులో రూ.48 లక్షల ఫైన్లు వసూలు

By:  Tupaki Desk   |   13 March 2021 5:47 AM GMT
ఒక్కరోజులో రూ.48 లక్షల ఫైన్లు వసూలు
X
మహారాష్ట్రను మరోసారి కరోనా మహమ్మారి కమ్మేస్తోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రజల నిర్లక్ష్యం, సామాజిక దూరం పాటించకపోవడం.. మాస్క్ ధరించకపోవడమే కారణమని తేల్చారు.

ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై దాడులు ముమ్మరం చేశారు. దీంతో గత గురువారం ఒక్కరోజే జరిమానా రూపంలో రూ.48 లక్షలు వసూలయ్యాయి. ఆరోజు ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టిన తనిఖీల్లో ఏకంగా మాస్కులు లేకుండా తిరుగుతున్న 24226 మంది నుంచి రూ.48.25 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు.

గురువారం పట్టుబడిన వారిలో 8674 మందిపై నగర పోలీసులు చర్యలు తీసుకున్నారు. బీఎంసీ ముంబై కార్పొరేషన్ సిబ్బందికి ప్రతిరోజు 20వేల మందిని పట్టుకోవాలని టార్గెట్ విధించింది. దీంతో నగర పోలీసులు మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై దృష్టి సారిస్తున్నారు.

మాస్కులు లేకుండా తిరుగుతున్న వారి నుంచే కరోనా వ్యాపిస్తోందని మున్సిపల్ అధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటివరకు 2020 ఏప్రిల్ 20 నుంచి 343 రోజుల్లో 18,45,777 మందిపై చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. వీరి నుంచి రూ.37.27 కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు.

ఇక రైళ్లలోనూ మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రైళ్లలో తిరుగుతున్న 3,03,025 మంది నుంచి రూ.6,63,34,400 జరిమానా వసూలు చేశారు.