Begin typing your search above and press return to search.
కుక్కకి ఎందుకు మనీష్?
By: Tupaki Desk | 20 April 2015 1:55 PM GMTసరదాకోసం చేశాడో, తింగరితనంతో చేశాడో తెలియదు కానీ... తన పెంపుడు కుక్కకి ఆధర్ కార్డు కావాలని ధరఖాస్తు చేసుకున్నాడు ఓ ప్రభుద్దుడు! "ప్రతీదానికీ ఆధార్ తో లింక్" అనే పదం ఈ కుర్రోడికి అలా అర్థం అయ్యినట్లుంది! ప్రతీ దానికీ అంటే... ప్రతీ పథకానికీ, ప్రతీ పనికీ అని అర్థం కానీ... ప్రతీ ప్రాణికీ అని కాదని మనోడికి తెలిసేలోపు పోలీసులు తీసుకుపోయారు.
వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజిపూర్ జిల్లా రాజాపూర్ గ్రామంలో మనీష్ కుమార్ అనే వ్యక్తి ఆన్ లై ధరఖాస్తులో తన కుక్క ఫోటో పెట్టి అప్లై చేశాడు. మనీష్ ఓ ప్రవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయంలో ఏ ఫేస్ బుక్ లోనో చాటింగ్ చేసుకోక, ప్రభుత్వాధికారులను చీటింగ్ చేశాడు. ఈ అప్లికేషన్ చూసిన అధికారులకు... కుక్క ఫోటోతో వచ్చిన ధరఖాస్తును పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 469 సెక్షన్ కింద మనీష్ పై కేసు నమోదు చేశారు. అయితే పోలీసు విచారణలో మాత్రం... సరదా కోసమే కుక్క ఫోటోతో అప్లై చేశానని మనీష్ కుమార్ వెల్లడించాడట!