Begin typing your search above and press return to search.
తమిళులకు టెన్షన్ తెప్పించిన తమిళచ్చి
By: Tupaki Desk | 1 Oct 2016 5:33 AM GMT‘అమ్మ’కు ఏమైంది? ఇప్పుడెలా ఉంది? ఉత్త జ్వరానికే తొమ్మిది రోజుల నుంచి ఆసుపత్రిలో ఉంచుతారా? ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందంట.. ఇలాంటి సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తమిళులు. అమ్మ అనారోగ్యంపై వారి ఆందోళనల తీవ్రత గంట గంటకూ రెట్టింపు అవుతోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో వచ్చి పడుతున్న మెసేజ్ లు మరింత మంటపుట్టిస్తున్నాయి. అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించిందని.. ఆమెను వెంటిలేటర్ మీద ఉంచారంటూ సాగుతున్న ప్రచారంతో తమిళులు ఉలిక్కిపడుతున్నారు. లేనిపోని సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
సాధారణ ప్రజల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక అన్నాడీఎంకే నేతలు.. కార్యకర్తల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. అమ్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువని తేల్చటంతో పాటు.. ఇంత ప్రచారానికి కారణం.. అక్కడెక్కడో ఫ్రాన్స్ లో ఉన్న ఒక మహిళగా చెబుతున్నారు పోలీసులు. ఉద్యోగ రీత్యా ఫ్రాన్స్ లో ఉన్న తమిళచ్చి అనే మహిళ మొదలెట్టిన ప్రచారంతోనే అమ్మ ఆనారోగ్యంపై రచ్చ రచ్చ సాగుతుందని.. ఆమె చేసిన పోస్టులు వైరల్ గా మారి.. సోషల్ మీడియాను ఊపేస్తున్నాయని.. తమిళుల్లో టెన్షన్ పుట్టిస్తున్నట్లుగా చెన్నై పోలీసులు గుర్తించారు.
గత నెల(సెప్టెంబరు) 22 అర్థరాత్రి వేళ హడావుడిగా చెన్నైలోని అపోలో ఆసుపత్రికి అమ్మను తరలించటం.. ఆమెకు చికిత్స చేస్తున్నట్లుగా ప్రకటించటం.. ఆమె తీవ్రమైన జ్వరం.. డీహైడ్రేషన్ కు గురైనట్లుగా చెప్పిన నేపథ్యంలో.. జ్వరానికి ఇన్నేసి రోజులు చికిత్స చేస్తారా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాల్ని మరింత పెంచేలా.. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం తమిళనాడును ఊపేస్తుంది. ఇలాంటి పుకార్లను నమ్మ వద్దని.. అమ్మ ఆరోగ్యం భేషుగ్గా ఉందంటూ తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది.
ముఖ్యమంత్రి ఆరోగ్యంపై సందేహాలు వెల్లువెత్తేలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆమె ఆరోగ్యం గురించి వివరాలు వెల్లడించాల్సిందిగా డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు. జయ ఆరోగ్యం బాగుందని.. కావేరీ వ్యవహారంపై గంటకుపైగా అధికారులతో చర్చలు జరిపారని.. ఢిల్లీలో కావేరీ వివాదంపై జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రసంగ పాఠాన్ని ఆమే స్వయంగా డిక్టేట్ చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయే కానీ.. అందుకు తగిన ఫోటోల్ని ఎందుకు విడుదల చేయరంటూ డీఎంకే చీఫ్ కరుణానిధి ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమ్మ ఆరోగ్యంపై మొదలైన పుకార్లకు బీజాలు వెతికే ప్రయత్నం మొదలెట్టిన చెన్నై పోలీసులు చివరకు.. మూలాలు పట్టుకున్నట్లు చెబుతున్నారు.
జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టించిన నేరంపై ఫ్రాన్స్ లో ఉంటున్న తమిళచ్చి అనే మహిళపై గ్రేటర్ చెన్నై పోలీసులు కేసు నమదు చేశారు. జయ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ ఆమె ఫేస్ బుక్ లో మొదలెట్టిన ప్రచారంతోనే అమ్మ ఆరోగ్యంపై ఇంత రచ్చ జరుగుతున్నట్లుగా పోలీసులు తేల్చి.. ఐదు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అమ్మ ఆరోగ్యం బాగుందని.. వదంతుల్ని నమ్మొద్దని అన్నాడీఎంకే ప్రచార విభాగ ప్రతినిధి సరస్వతి చెబుతున్నారు. ఇన్ని చెప్పే బదులు.. ‘‘నేను బాగున్నాను. మీరు టెన్షన్ పడకండి. కాస్త అనారోగ్యంగా ఉంది. త్వరలో మిమ్మల్ని కలిసి మాట్లాడతా’’ లాంటి నాలుగు ముక్కలు అమ్మ చేత చెప్పిస్తే ఈ గోలంతా ఉండదు కదా?ఇది కూడా వద్దనుకుంటే.. ముఖ్య అధికారులతో అమ్మ నిర్వహిస్తున్న మీటింగ్ ను ఒక నిమిషం పాటు లైవ్ ఇచ్చేస్తే.. తమిళులంతా తమ గుండెల నిండా ఊపిరి పీల్చుకొని తమ పనులు తాము చేసుకుంటారు కదా? అన్న ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానం చెప్పే వారుంటే ఎంత బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/