Begin typing your search above and press return to search.
జిగ్నేశ్ మేవానీ..ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో చాలా ఫాస్ట్!
By: Tupaki Desk | 16 Jun 2019 6:10 AM GMTకాంగ్రెస్ పార్టీ ఆర్టిఫిషియల్ హ్యాండ్లలో ఒకటైన జిగ్నేశ్ మేవానీ గుర్తున్నారు కదా. గుజరాత్ ఎన్నికల సమయంలో మోదీని ఎలాగైనా ఓడించాలనే ఆశతో కాంగ్రెస్ ట్రై చేసిన ఆర్టిఫిషియల్ హ్యాండ్లలో మేవానీ కూడా ఒకరు. కాంగ్రెస్ ఇచ్చిన బ్యాకప్ తో దేశంలో ఆయన కూడా పాపులర్ పొలిటీషియన్ అయ్యారు.
దళిత నాయకుడైన మేవానీ మంచి వక్త.. కానీ, రాజకీయాలకు అత్యవసరమైన క్రెడిబులిటీ ఆయనకు లేకపోవడం వల్లే విఫలమయ్యారని టాక్. మేవానీ చేసే పనులూ అలాగే ఉంటాయి. గత ఏడాది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సంబంధించిన ఫొటోలంటూ కొన్ని మార్ఫింగ్ ఇమేజెస్ సోషల్ మీడియాలో షేర్ చేసి.. తరువాత అవి ఫేక్ అని తెలిసి క్షమాపణలు చెప్పుకొన్నారీయన. తాజాగా గుజరాత్ లోని ఓ స్కూలు విషయంలోనూ ఇలాగే ఫేక్ వీడియో ట్వీట్ చేసిఅడ్డంగా దొరికిపోయారు. ఈజిప్ట్ దేశంలోని పాత వీడియోను గుజరాత్‌ది అంటూ షేర్ చేయడంతో పాటు దాన్ని పీఎంవోకి కూడా ట్యాగ్ చేశారు. దీన్ని షేర్ చేయాలంటూ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చార. దీంతో ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి స్కూలు ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై మేవానిపై కేసు నమోదైంది.
అర్ధ నగ్నంగా ఉన్న ఓ విద్యార్థిని ఓ వ్యక్తి కొడుతున్నట్టు ఉన్న వీడియోను గత నెల 20న తన ట్విట్టర్ ఖాతాలో మేవాని పోస్టు చేశారు. పిల్లాడిని చావబాదుతున్న ఆ టీచర్ వల్సాద్ కు చెందిన ఆర్ ఎంవీఎం స్కూలుకు చెందిన వారని మేవాని తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ వీడియోపై స్పందించిన ఆర్ ఎంవీఎం స్కూలు ప్రిన్సిపాల్ విజల్ కుమారి పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆ వీడియో తమ స్కూలుది కాదని - పాఠశాల పేరును - ఉపాధ్యాయులను అప్రతిష్ఠ పాలు చేసేందుకు జరుగుతున్న కుట్ర అని ప్రిన్సిపల్ కంప్లయింట్ చేశారు. ఈ వీడియోను పోస్టు చేసిన ఎమ్మెల్యే మేవానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉపాధ్యాయుడిని టీచర్ కొడుతున్న వీడియోను షేర్ చేసిన మేవాని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. ఆర్ఎంవీఎం స్కూలును మూసివేసే వరకు ఈ వీడియోను వీలైనంతమందికి షేర్ చేయాలని ఎమ్మెల్యే కోరారు. అయితే, ఆ వీడియో గుజరాత్ కు చెందినది కాదని - ఈజిప్టులోని ఓ స్కూలుకు చెందినదని తెలియడంతో ఆ తర్వాత కొన్ని గంటల్లోనే వీడియోను తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించారు.