Begin typing your search above and press return to search.
స్టార్ హీరోపై ఎఫ్‌ఐఆర్ నమోదు
By: Tupaki Desk | 18 May 2022 9:31 AM GMTఈమద్య కాలంలో ప్రతి సినిమా కూడా ఏదో ఒక వివాదం ను మూట కట్టుకుంటూ ఉంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు అన్ని కూడా ఏదో ఒక విధమైన వివాదాన్ని మూట కట్టుకుంటూ వివాదాల్లో నిలుస్తున్నాయి. కొందరు కావాలని పబ్లిసిటీ కోసం సినిమాలను అడ్డు పెట్టుకుని వివాదాలను సృష్టిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం మరో రకంగా వివాదాలను సృష్టిస్తూ ఉన్నారు. ఆస్కార్ స్థాయికి వెళ్లిన జై భీమ్ ను కూడా కొన్ని కారణాల వల్ల వివాదాలు వెంటాడుతున్నాయి.
జై భీమ్ సినిమాలో వన్నియర్ సామాజిక వర్గంకు చెందిన వారిని విమర్శించారు.. తక్కువ చేసి చూపించారు.. అవమానించారు అంటూ ఆమద్య హడావుడి కొనసాగిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే వివాదంలో సూర్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. సూర్య పై మాత్రమే కాకుండా నిర్మాతగా వ్యవహరించిన జ్యోతిక ఇంకా దర్శకుడు టీజే జ్ఞానవేల్ పై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది.
మొదట రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ గతంలో పోలీసులకు ఇదే విషయమై ఫిర్యాదు చేశాడు. కాని పోలీసులు కేసు నమోదు చేసేందుకు అంగీకరించ లేదు. పోలీసులు స్పందించక పోవడంతో కోర్టుకు వెళ్లిన సంతోష్ అక్కడ పిటీషన్ వేశాడు.
సంతోష్ పిటీషన్ విచారించిన కోర్టు వెంటనే జై భీమ్ యూనిట్ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో నమోదు అయ్యింది.
జై భీమ్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. కాని ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సూర్య అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జై భీమ్ లో ఉద్దేశ్య పూర్వకంగా ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు.. ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేయాలని చూడలేదు అంటూ సూర్య గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు అవ్వడంతో సూర్య స్పందన ఏంటీ అనేది చూడాలి.