Begin typing your search above and press return to search.

కొల్లాం టెంపుల్ లో ఫైర్.. 75మంది మృతి

By:  Tupaki Desk   |   10 April 2016 4:20 AM GMT
కొల్లాం టెంపుల్ లో ఫైర్.. 75మంది మృతి
X
మరో మహా విషాదం చోటు చేసుకుంది. ఆలయాల్లో జరిగే అధ్యాత్మిక కార్యక్రమాలకు భారీగా హాజరయ్యే భక్తజనం.. భక్తిపారవశ్యంతో చోటు చేసుకునే తొక్కిసలాట.. సంప్రదాయంగా జరిగే ఉత్సావాల్లో దొర్లే తప్పులు భక్తుల ప్రాణాలు తీయటం తెలిసిందే. తాజాగా అలాంటి ఘోర ఘటన కేరళలో చోటు చేసుకుంది. కొల్లంలోని పుట్టింగల్ దేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3.30 నుంచి నాలుగు గంటల మధ్యలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 75 మంది భక్తులు మృత్యువాత పడటం షాకింగ్ గా మారింది. మరో 200 పైగా భక్తులు గాయాలపాలయ్యారు.

మలయాళ నెలల ప్రకారం భరని నక్షత్రంలో మీనాభరణి ఉత్సావాణ్ని పుట్టింగల్ దేవి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్ని ముందురోజు రాత్రి నుంచే చేస్తుంటారు. ఈ ఉత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చటం ఆనవాయితీ. ఇందులో భాగంగా భక్తులు బాణసంచా కాల్చటం.. ఆ నిప్పు రవ్వలు ఆలయం మీద పడి ఆగ్నిప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. ఆలయంలో అత్యధిక భాగం కలపతో నిర్మించి ఉండటంతో అగ్నిప్రమాదం క్షణాల్లో గుడి చుట్టూ వ్యాపించిందని చెబుతున్నారు.

ఊహించని విధంగా చోటు చేసుకున్న అగ్నిప్రమాదంతో భక్తుల మధ్య చోటు చేసుకున్న తొక్కిసలాట మృతులసంఖ్య పెరిగేందుకు కారణమైందని చెబుతున్నారు. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలతో ఎటువైపు వెళ్లాలో అర్థం కాక భక్తులు ఉండిపోయారని చెబుతున్నారు. క్యూలైన్లు వేసిన పైకప్పు అంటుకోవటం.. బయకు వెళ్లే దారులు మూసుకుపోవటంతో భక్తులు సజీవ దహనమయ్యారని చెబుతున్నారు. ఆగ్నిప్రమాదంలో చిక్కుకున్న భక్తులు సజీవ దహనమయ్యారని.. గుడి ప్రాంగణమంతా మాంసపు ముద్దలతో భీతిల్లిపోయేలా ఉంది. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే.. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన కేరళలో పెను విషాదాన్ని నింపింది.