Begin typing your search above and press return to search.
రాజయ్య ఫ్యామిలీఫ్రెండ్స్ కూడా తిట్టిపోస్తున్నారు!
By: Tupaki Desk | 4 Nov 2015 5:51 AM GMTవరంగల్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన, మాజీ ఎంపీ రాజయ్య కోడలు మరియు ముగ్గురు మనుమలు అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలవడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నది. ఈవిషయంలో ఇరుగు పొరుగు వారు సహా.. రాజయ్య కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వారు కూడా ఆయనను దారుణంగా తిట్టిపోస్తున్నారు. మహిళాసంఘాలైతే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే హత్య చేశారని, హత్య కేసు కింద అరెస్టు చేసి విచారణ జరిపించాలని డిమాండ్లు వస్తున్నాయి.
దుర్ఘటన స్థలం వద్ద టీవీ చానెళ్లతో పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఉదాహరణకు...
రాజయ్య భార్య మాధవికి తాను చిన్న నాటి స్నేహితురాలినని.. ఆమెతో కలిసి చదువకున్నానని ఓ మహిళ చెప్పుకుంది. రాజయ్య గానీ, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ అందరూ చాలా సాత్వికంగా ఉంటారని కానీ కుటుంబంలోని తగాదాని ఇంత దూరం ఎందుకు తీసుకవచ్చారో అర్థం కావడం లేదని ఆమె పేర్కొన్నారు. ముగ్గురు పసిపిల్లల్తో సహా కోడలు ఇలా ఘోరంగా చనిపోవడం అనేది బాధాకరం అని ఆమె కూడా అన్నారు. ఇది పూర్తిగా రాజయ్య కుటుంబం చేసిన తప్పు అని ఆమె అంటున్నారు. రాజయ్య కు కఠిన శిక్ష పడాలని, భవిష్యత్తులో కూడా ఆయన మరే ఎన్నికల్లోనూ పోటీచేయకుండా.. చూడాలని ఆమె కోరారు.
రాజయ్య ఇల్లు ఉన్న కాలనీలోని ఇరుగుపొరుగు వారు కూడా ఆయన మీద నిప్పులు చెరుగుతున్నారు. మరో మహిళ అయితే ఏకంగా ఇదే ఘటన పల్లెల్లో జరిగిగే రాజయ్యను కూడా అందరూ కలిసి కాలబెట్టేస్తారని ఆవేశంగా అంటున్నారు. ఇక్కడ పోలీసు సెక్యూరిటీ ఎక్కువగా ఉండడం వల్ల , పొలిటీషియన్ కావడం వల్ల ఆయన తప్పించుకున్నారని .. ఇప్పటికైనా అందరూ కలిసి రాజయ్య కుటుంబాన్ని కాలబెట్టాలని ఆమె నిప్పులు కక్కారు.
రాజయ్య ఇంటి వద్ద గుమికూడిన కాలనీలోని ఇతర మహిళలుకూడా.. జరిగిందేమిటో అందరికీ తెలసు.. రాజయ్యకు కఠిన శిక్ష పడాల్సిందే.. ఆయనను అరెస్టు చేసిన తర్వాతే పోలీసులు విచారణ సాగించాలి అంటూ డిమాండ్లతో టీవీ ఛానెళ్లను హోరెత్తించేస్తున్నారు.
రాజయ్య పోటీనుంచి తప్పుకుని ఉండవచ్చ గాక.. కానీ.. ఆయన మీద ఇప్పుడు వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ అవకాశాలనే దెబ్బతీసేలా కనిపిస్తోంది.