Begin typing your search above and press return to search.
ఒకేరోజు.. రెండు తెలుగు రాష్ట్రాల రోడ్డు మీదకు ఫైర్ బ్రాండ్లు
By: Tupaki Desk | 3 Oct 2021 2:30 AM GMTచాలా రోజుల తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఒకే రోజు.. ఇంచుమించు ఒకే సమయంలో రాజకీయ అలజడి చోటు చేసుకోవటం.. దీనికి ఇరువురు విపక్ష నేతలే కాదు.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఇద్దరు రోడ్ల మీదకు వచ్చి చెలరేగిపోతున్న తీరుతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి. ఇంతకీ ఆ ఇద్దరు రాజకీయ ప్రముఖులు ఎవరంటే.. ఒకరు పవన్ కల్యాణ్ అయితే మరొకరు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
వీరిద్దరూ అధికారపక్షం తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాల్ని చేపట్టారు. ఏపీ వ్యాప్తంగా చెడిపోయిన రోడ్ల మీద పవన్ కల్యాణ్ గళం విప్పితే.. నిరుద్యోగ సమస్య మీద రేవంత్ రెడ్డి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రెండు కార్యక్రమాల్ని నిలువరించేందుకు రెండు రాష్ట్రాల్లోని పోలీసులు తీవ్రంగా శ్రమించారని చెప్పాలి. అయినప్పటికి ఫలితం లేకుండా పోయిందని చెప్పాలి. అంతేకాదు.. ఈ సందర్భంగా అటు పవన్.. ఇటు రేవంత్ పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేపట్టిన నిరసన ఆందోళనను కుట్ర పూరితంగా దెబ్బ తీయాలన్న ఆలోచనతోనే తమ కార్యక్రమానికి పోలీసులు అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ విషయం మీద ఎవరూ స్పందించలేదు. కానీ.. ఏపీలో మాత్రం ఏపీ ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల మాత్రం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
పవన్ ను ఆపాలన్న ఉద్దేం తమకు లేదన్న ఆయన.. రోడ్ల మరమ్మతు బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకుందని.. అందుకు భారీగా నిధులు విడుదల చేశామని సర్ది చెప్పే ప్రయత్నంతో పాటు.. రోడ్ల సమస్యకు పరిష్కారం కనుగున్నట్లుగా చెప్పేయటం గమనార్హం. మొత్తానికి ఒకే రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు విరుచుకుపడటం మాత్రం చాలా అరుదుగా చోటు చేసుకునే పరిణామంగా చెప్పక తప్పదు.