Begin typing your search above and press return to search.
పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద మళ్లీ అగ్నిప్రమాదం వారంలో రెండోసారి - భారీగా ట్రాఫిక్ జామ్!
By: Tupaki Desk | 16 March 2021 10:26 AM GMTహైదరాబాద్ లో రద్దీగా ఉండే రోడ్డు పై భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిత్యం వాహనాలు, విద్యార్థులు, ఉద్యోగులతో రద్దీగా ఉండే పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లై ఓవర్ పిల్లర్ కు చేసిన ఫైబర్ డెకరేషన్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యి క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. మంటల నుంచి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కప్పేసింది. దీంతో కాసేపు ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఒక్కసారిగా మంటలు రావడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడానికి యత్నిస్తోంది. కాగా, మూడు రోజుల కిందటే పంజాగుట్ట ఫ్లై ఓవర్ కింద ఏర్పాటు చేసిన డెకరేషన్ కు మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించడం తెలిసిందే. మరోసారి పంజాగుట్ట ఫ్లై ఓవర్ కింద అదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం తో దీనిపై నగర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రమాదం నేపథ్యంలో పంజాగుట్ట మార్గంలో పోలీసులు వాహనాల రాకపోకలను కాసేపు నిలిపివేశారు.
ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణ స్థాయికి చేరింది. మార్చి 12 న కూడా సరిగ్గా ఇలాగే, దాదాపు మధ్యాహ్నం సమయంలోనే పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద అగ్నప్రమాదం సంభవించింది. తాజా ప్రమాదం కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారూ