Begin typing your search above and press return to search.
అంబానీ.. అదానీలపై ఫైర్ బ్రాండ్ టికాయిత్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 6 Sep 2021 3:56 AM GMTకరోనా మొదటి వేవ్ కు కాస్త ముందుగా మోడీ సర్కారు తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ చేపట్టిన కిసాన్ మహాపంచాయత్ ఆందోళన దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించటమే కాదు.. గతంలో ఎప్పుడూ లేనంతగా మోడీ సర్కారును ఇబ్బందికి గురి చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని యూపీ (ఉత్తరప్రదేశ్) రాష్ట్ర రాజధాని లక్నోలో ఒక భారీ సభను నిర్వహించారు. దీనికి వేలాది మంది హాజరు కావటమే కాదు.. పలు రాష్ట్రాల నుంచి 300 సంఘాలకు చెందిన రైతులు హాజరు కావటం గమనార్హం.
ఈ సభకు రైతు నేత కమ్ ఫైర్ బ్రాండ్ రాకేశ్ టికాయిత్ తోపాటు.. మేధా పాట్కర్.. యోగేంద్ర యాదవ్ తో సహా పెద్దఎత్తున రైతులుహాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బడా పారిశ్రామికవేత్తలు అంబానీ.. అదానీలపైనా ఘాటు విమర్శలు చేశారు. అవేమంటే..
- ఎయిర్ పోర్టులు, రైల్వేలు.. బ్యాంకులు ఇలా అన్నింటిని ప్రధాని మోడీ తెగనమ్ముతున్నారు. వీటికి అంబానీ.. అదానీలే కొనుగోలుదారులు. ఈ అమ్మకాలను అడ్డుకొని దేశాన్ని రక్షిస్తాం.
- ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కారు చెరుకు పంట ధరను రూపాయి కూడా పెంచలేదు. వచ్చే ఎన్నికల్లో యోగి ప్రభుత్వాన్ని ఓడించాలి.
- మోడీ.. అమిత్ షా.. సీఎం యోగి అందరూ విధ్వంసకారులు.. బయట వ్యక్తులు.
- ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేది మోడీ అయితే..కొనేది మాత్రం అంబానీ.. అదానీలే