Begin typing your search above and press return to search.
సుప్రీం కోర్టుకు కూడా పాకిన కరోనా ... ఉద్యోగికి పాజిటివ్ !
By: Tupaki Desk | 28 April 2020 7:10 AM GMTకరోనా సెగ భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంను తాకింది. తాజాగా సుప్రీం లో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. సుప్రీం కోర్టులో పనిచేసే రిజిస్ట్రార్‌కు కరోనా వైరస్ సోకినట్లు ఆదివారం నిర్ధారణ అయింది. ఏప్రిల్ 16న కోర్టుకు వచ్చి విధులు నిర్వహించిన ఆయన తర్వాత రెండు రోజులు జ్వరంతో బాధపడ్డాడు. దీంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దీంతో సుప్రీం కోర్టు సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అదే సెక్షన్ లో పనిచేస్తున్న మరో ఇద్దర్ని సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అలాగే , పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కరోనా ఎలా సోకిందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే , ఈనెల 16 నుంచి విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
కాగా లాక్ డౌన్ ప్రారంభమైన నాటినుంచి రిజిస్ట్రార్ ఉద్యోగులు పరిమితంగానే పనిచేస్తున్నారు. కేవలం “స్కెలిటన్” స్టాఫ్ తో మాత్రమే సుప్రీం పనిచేస్తుంది. అయితే కోర్టులు వీలైనంతవరకు అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే , మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు 3108కు చేరుకున్నాయి. అందులో 2177 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 877 మంది వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 54మంది మరణించారు.