Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో తోలి కరోనా మృతి..ఐసోలేషన్‌ లో 34 మంది!

By:  Tupaki Desk   |   14 March 2020 7:45 AM GMT
హైదరాబాద్ లో తోలి కరోనా మృతి..ఐసోలేషన్‌ లో 34 మంది!
X
కర్ణాటకలోకి కలబుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ కారణంగా మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన.. మార్చి 10న డిశ్చార్జి అయిన కాసేపటికే చనిపోయారు. అంతకు ముందు నగరంలోని మరో మూడు హాస్పిటళ్లు ఆయన్ను అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించగా.. చివరకు కేర్‌ హాస్పిటల్‌ లో మూడు గంటలపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.

ఆ తరువాత గాంధీ హాస్పిటల్‌ కు తీసుకెళ్లాలని కేర్ హాస్పిటల్ సిబ్బంది తెలుపగా .. ఆయన బంధువులు కలబుర్గికి తీసుకెళ్లారు. కాగా కేర్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ బయల్దేరిన గంటకే ఆ పేషెంట్ చనిపోయినట్టు సమాచారం. కాగా, బాధితుడితో కేర్ హాస్పిటల్‌ లో 17 మంది కాంటాక్ట్‌ లో ఉన్నట్టు గుర్తించారు. నగరంలోని మూడు హాస్పిటల్స్‌కు తీసుకెళ్లినప్పుడు అక్కడ మరో 100 మంది కాంటాక్ట్ అయినట్టు తెలుస్తోంది.

అయితే, కరోనాతో చనిపోయిన వ్యక్తితో మొత్తం 34 మంది కాంటాక్ట్‌ లో ఉన్నట్టు గుర్తించామని శుక్రవారం రాత్రి తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రితో పాటు మరికొందరి కోసం శోధిస్తున్నామని వివరించారు. గుర్తించిన 34 మందిని ఇళ్లకే పరిమితం చేసి, పర్యవేక్షిస్తున్నామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఇక, జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌ కు చెందిన కనీసం ఐదుగురు ఆయన తో కాంటాక్ట్ అయినట్టు గుర్తించారు. కోవిడ్ వ్యాధిగ్రస్తుడు గురించి ముందుగానే తెలిసిన సిబ్బంది సన్నద్ధంగానే ఉన్నారని, హాస్పిటల్‌ కు వచ్చిన వెంటనే అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి, గాంధీ హాస్పిటల్‌ కు తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం కేర్ హాస్పిటల్లో కరోనా పేషెంట్‌ను పర్యవేక్షించిన నర్సును ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఈ కేసు గురించి తాము ఆరోగ్య శాఖకు సమాచారం అందిచామని కేర్ వర్గాలు తెలిపాయి.