Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : హెడ్ కానిస్టేబుల్‌ కు కరోనా పాజిటివ్ ..ఎక్కడంటే !

By:  Tupaki Desk   |   7 April 2020 7:50 AM GMT
బ్రేకింగ్ : హెడ్ కానిస్టేబుల్‌ కు కరోనా పాజిటివ్ ..ఎక్కడంటే  !
X
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ పోలీసు విభాగంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సైఫాబాద్ పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌ కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీనితో ఆ స్టేషన్ లో పని చేసే 12 మంది సిబ్బంది క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆయన ఎక్కడికీ ప్రయాణించలేదని తెలుస్తోంది. పోలీసు శాఖలో, అందులోనూ హైదరాబాద్‌ లో పని చేసే హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా సోకడంతో.. తెలంగాణ పోలీసు విభాగం మొత్తం అప్రమత్తమైంది.

ఈ కరోనా దేశంలో వేగంగా విస్తరిస్తున్నప్పటి నుండి .పోలీసులు కూడా ప్రాణాలకి తెగించి ..ప్రజల కోసం కరోనా పై యుద్ధం చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మల్లేపల్లిలోని బడీ మసీదు వద్ద ఇటీవల అతను ఓ వ్యక్తిని కలిసినట్టు సమాచారం. ఆ వ్యక్తి నిజాముద్దీన్ మర్కజ్‌ లో ప్రార్థనలకు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్‌ కి పాజిటివ్‌ గా తేలడంతో.. పంజాగుట్టలోని అతని ఇంటికి మెడికల్ హెల్త్ & జీహెచ్ ఎంసీ సిబ్బంది వెళ్లారు. అతనితో సన్నిహితంగా మెలిగిన ఏడుగురిని గుర్తించి ఐసోలేషన్ వార్డులకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 364కు చేరింది. ఈ వైరస్ బారిన పడి రాష్ట్రంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 45 మంది కరోనా నుండి కోలుకున్నారు. సోమవారం ఒక్క రోజే 30 కొత్త కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం యాక్టివ్‌ గా ఉన్న కేసుల సంఖ్య 308కి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 4778 కేసులు నమోదవగా.. 136 మంది మృత్యువాత పడ్డారు.