Begin typing your search above and press return to search.

కరోనా నుండి కోలుకున్న మొదటి ఇండియన్‌ అనుభవం

By:  Tupaki Desk   |   30 March 2020 9:30 PM GMT
కరోనా నుండి కోలుకున్న మొదటి ఇండియన్‌ అనుభవం
X
కరోనా... ప్రస్తుతం ఈ మూడు అక్షరాలకు ప్రపంచమే గజగజ వణికి పోతుంది. 200 దేశాలకు పైగా ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. దాదాపుగా 8 లక్షల మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అయితే ఇక్కడ ఆనందించాల్సి విషయం ఏంటీ అంటే కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ వైరస్‌ రావడం లేదు. ఒకవేళ వైరస్‌ వచ్చినా వెంటనే గుర్తించి వైధ్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌ వార్డుకు వెళ్తే వైరస్‌ నుండి బయట పడవచ్చు. ఈ విషయం కాస్త ఊరటను ఇచ్చే విషయం. కరోనా పాజిటివ్‌ గా నిర్థారించబడి మళ్లీ కోలుకుని నెగటివ్‌ కు వచ్చిన దిల్లీ వ్యక్తి రోహిత్‌ దత్తా తన అనుభవాలను ఒక జాతీయ మీడియా సంస్థతో పంచుకున్నాడు.

జనాలు భయాందోళనకు గురి అవుతున్న ఈ సమయంలో ఆయన మాటలు కాస్త ధైర్యంను కలిగిస్తున్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో మానసిక ధైర్యం చాలా అవసరం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కరోనా లక్షణాలను ఆరంభ దశలోనే తెలుసుకుంటే అంటే ఎంత త్వరగా కరోనాను మన శరీరంలో తెలుసుకుంటామో అంతే త్వరగా హాస్పిటల్‌ నుండి బయటకు వచ్చేస్తాము. నాకు అంతర్జాతీయ స్థాయి ట్రీట్‌ మెంట్‌ అందించడం తో నేను చాలా త్వరగా కోలుకున్నాను అన్నాడు.

నేను యూరప్‌ నుండి తిరిగి వచ్చిన వెంటనే జ్వరం అనిపించింది. ఎక్కువ జర్నీ చేయడం వల్ల జ్వరం వచ్చి ఉంటుందని అనుకున్నాను. హాస్పిటల్‌కు వెళ్లి మూడు రోజులు ట్రీట్‌ మెంట్‌ తీసుకున్నా కూడా సమస్య తగ్గక పోవడంతో నేను కరోనా టెస్ట్‌ చేయాల్సిందిగా డాక్టర్‌ ను కోరగా తర్వాత రోజు వారు కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌ వచ్చింది. దాంతో వెంటనే నన్ను ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికత్స అందించారు. మొదటి నాలుగు రోజులు చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నేను కనీసం మాట్లాడలేక పోయాను.

నా వద్ద ఫోన్‌ ఉండటం వల్ల సినిమాలు చూడటం.. పుస్తకాలు చదవడం వంటివి చేశాను. నా కుటుంబ సభ్యుల తో కూడా మాట్లాడటం చేశాను. 14 రోజులు నా ఒంటరితనం నన్ను పూర్తిగా మార్చేసింది. ఆ సమయంలో నాకు వచ్చిన ఆలోచనలు అన్నీ ఇన్నీ కావు అన్నాడు. కరోనా వైరస్‌ కు సరైన చికిత్స అవసరం అంతే తప్ప హాస్పిటల్‌ వసతుల గురించి పట్టించుకోవద్దని అన్నాడు.

చైనాలో పేషెంట్స్‌ ఎక్కువగా ఉన్న సమయంలో టెంట్ల కింద ట్రీట్‌ మెంట్‌ ఇచ్చారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం కరోనా వైరస్‌ ను ధాటిగా ఎదుర్కొంటుందని ఆయన అన్నాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవ్వాలని ఏమాత్రం అనారోగ్యం ఉన్నా కూడా వెంటనే వైధ్యులను సంప్రదించాలంటూ సూచించాడు. భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలన్నాడు.