Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీ: విద్యుత్ ఒప్పందాల పై రచ్చరచ్చ

By:  Tupaki Desk   |   9 Dec 2019 7:11 AM GMT
ఏపీ అసెంబ్లీ: విద్యుత్ ఒప్పందాల పై రచ్చరచ్చ
X
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే వేడి పుట్టించాయి. ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీకి ఉల్లిధరల పెంపు, నిత్యావసరాలు చుక్కలనంటడంపై నిరసన తెలుపుతూ అసెంబ్లీకి ర్యాలీగా చేరుకుంది. వారిని భద్రత సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.

ఏపీ అసెంబ్లీ మొదలు కావడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తీవ్ర వాగ్వాదం నడిచింది. తొలిరోజే తొలి చర్చ రచ్చరచ్చ అయ్యింది. ప్రభుత్వం తీరుతో విద్యుత్ సమస్యల తో ఏపీలో విలవిలలాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీనికి గత టీడీపీ హయాంలో విద్యుత్ పీపీఏలలో అవకతవకల పై అధికార వైసీపీ ఆధారాలతో ఎండగట్టింది.

ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ ఒప్పందాల వల్లే గత డిస్కంలు అన్ని మునిగిపోయాయని ఆరోపించారు. డిస్కంలను కుప్పకూల్చిందని చంద్రబాబేనని ధ్వజమెత్తారు. బాబు హయాంలో డిస్కంలకు 2వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

ఇక విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చేశారంటూ టీడీపీ అధికార వైసీపీ ని నిలదీసింది. ఆరు నెలల్లో విద్యుత్ పీపీఏ లు రద్దు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని ఆరోపించింది.ఇలా విద్యుత్ ఒప్పందాల విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం నడించింది.