Begin typing your search above and press return to search.

బ్రేకింగ్:కేరళలో తోలి కరోనా మరణం..!

By:  Tupaki Desk   |   28 March 2020 8:50 AM GMT
బ్రేకింగ్:కేరళలో తోలి కరోనా మరణం..!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ 198కిపైగా దేశాల్లో విస్తరించింది. దీనితో చాలా దేశాల్లో లాక్‌ డౌన్ అమల్లో ఉంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 27,350 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా - బాధితుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంది. కరోనా మహమ్మారి భారతదేశాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 900 దాటిపోయాయి. అందులో 83 మంది ఇప్పటివరకు కోలుకున్నారు. ఇక మొత్తం 803 మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 39 మందికి వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దేశంలోనే తొలి కేసు ఈ రాష్ట్రంలో నమోదయిన విషయం తెలిసిందే. తాజాగా, కేరళలో తొలి కరోనా వైరస్ మరణం చోటుచేసుకుంది. మార్చి 22న కరోనా వైరస్ లక్షణాలతో కలంసెరీ హాస్పిటల్‌ లో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. దీనితో కేరళలో ఇది తొలి మరణం కాగా.. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 20కి చేరుకుంది. మృతుడు దుబాయ్ పర్యటనకు వెళ్లొచ్చినట్టు తెలుస్తుంది. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కాగా.. అతడిని కలంసెరీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌ కు తరలించి ఐసోలేషన్‌ లో చికిత్స అందజేశారు.

కాగా, మృతుడికి హైబీపీ - షుగర్ - గుండె సంబంధింత ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ను ఎదుర్కోటానికి కేంద్ర ప్రభుత్వం తో సంబంధం లేకుండా ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించారు. కేరళలో కరోనా బాధితులను గుర్తించి వారిని ఆస్పత్రులకు తీసుకురాకుండా వారి ఇళ్లలోనే క్వారంటైన్ చేసి వైద్యులనే వారి వద్దకు పంపి కేరళ ప్రభుత్వం వైద్యం అందిస్తోంది.