Begin typing your search above and press return to search.

శ్రీ‌న‌గ‌ర్ లో ఆ అమ్మాయి సాహ‌సం వింటే ఫిదా!

By:  Tupaki Desk   |   6 Aug 2018 4:30 PM GMT
శ్రీ‌న‌గ‌ర్ లో ఆ అమ్మాయి సాహ‌సం వింటే ఫిదా!
X
అమ్మాయి అంటేనే స‌వాల‌చ్చ ప‌రిమితులు. అందునా.. క‌శ్మీర్ రాష్ట్ర రాజ‌ధాని శ్రీ‌న‌గ‌ర్ గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో తెలిని చోట‌.. లా చ‌దివిన ఒక అమ్మాయి కేఫ్ పెట్ట‌టం సాధ్య‌మా? అంటే నో అనేస్తారు. కానీ.. పాతికేళ్ల మేహ్ విష్ మెహ్ రాజ్ జ‌ర్గ‌ర్ దీనికి భిన్నం. అదే ఇప్పుడు ఆమెను వార్త‌ల్లోకి ఎక్కేలా చేయ‌ట‌మే కాదు.. సరికొత్త స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఏడేళ్ల వ‌య‌సులోనే తండ్రి కేన్స‌ర్ తో మ‌ర‌ణించ‌టంతో కుటుంబానికి ఆమె తల్లి పెద్ద దిక్కుగా మారింది. ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో పాటు.. ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో ఎన్నో క‌ష్టాలు ప‌డిందా ఫ్యామిలీ. త‌ల్లి ప‌డిన క‌ష్టాన్ని వ‌మ్ము చేయ‌కుండా చ‌దువుకున్న ముగ్గురు పిల్ల‌ల్లో మెహ్ రాజ్ కాస్త భిన్నం. అనుకున్న‌ది సాధించేందుకు ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవ‌టానికి ఆమె సిద్ధంగా ఉంటుంది. అదే ఆమెకు ఊహించ‌ని ఘ‌న‌త‌ను తెచ్చి పెట్టింది.

జ‌మ్ము క‌శ్మీర్ రాష్ట్ర రాజ‌ధాని శ్రీ‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో కేఫ్ ప్రారంభించిన తొలి క‌శ్మీర్ యువ‌తిగా ఆమెకు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఏంటి? ఆడ‌పిల్ల కేఫ్ పెట్ట‌ట‌మా? ఇదెక్క‌డి చోద్య‌మంటూ వెక్కిరించిన వారు.. నిరుత్సాహానికి గురి చేసినోళ్లు బోలెడంత మంది. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌కుండా.. తాను ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్ల‌టాన్నే న‌మ్ముకుంది. కుటుంబ స‌భ్యులు మొద‌ట్లో కాస్తంత సంశ‌యించినా.. త‌ర్వాత ఆమెకు త‌మ స‌హ‌కారాన్ని పూర్తిగా అందించారు.

లా చ‌దివిన‌ప్ప‌టికీ లాయ‌ర్ కానీ ఆమె.. ఊహించ‌ని రీతిలో కేఫ్ పెట్టిన మేహ్ విష్.. త‌న కేఫ్ కు నేను మ‌రియు మీరు అన్న అర్థం వ‌చ్చేలా పేరు పెట్టింది. క‌శ్మీర్ సంస్కృతి కొట్టొచ్చిన‌ట్లుగా ఉండే చీనార్ చెట్లు.. ఇత‌ర చిహ్నాల‌తో పాటు ఇంటీరియ‌ర్స్ ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. యూత్ కోరుకునే భిన్న రుచులు ల‌భించేలా ఏర్పాట్లు చేసింది. అదే ఆమెను ప్ర‌త్యేకంగా నిల‌ప‌ట‌మే కాదు.. అంద‌రి దృష్టి దీనిపై ప‌డేలా చేసింది. వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌తో ఆమె ఇప్పుడు దూసుకెళుతోంది. తాజాగా శ్రీ‌న‌గ‌ర్ లోనే మ‌రో బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు ఆమె సిద్ధ‌మ‌వుతున్నారు.
గ‌తానికి భిన్నంగా క‌శ్మీరీ అమ్మాయిలు అక్క‌డున్న అడ్డంకుల్ని.. ఇబ్బందుల్ని అధిగ‌మిస్తూ.. ఆర్ట్ సెలూన్లు.. బోటిక్ లు.. టెక్ స్టార్ట‌ప్ లు.. లాంటి వ్యాపారాలు స్టార్ట్ చేయ‌టానికి ముందుకొస్తున్నారు. కశ్మీర్ మారుతుంద‌న‌టానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు.