Begin typing your search above and press return to search.

ఈయన శోభనానికి అందరికీ ఆహ్వానం

By:  Tupaki Desk   |   17 Oct 2019 4:36 AM GMT
ఈయన శోభనానికి అందరికీ ఆహ్వానం
X
ఈరోజుల్లో ప్రతీది పండుగే.. ఆకలి రాజ్యం సినిమాలో అన్నట్టు ‘చావు కూడా ఒక పండుగ’లానే నిర్వహిస్తున్నారు. విషాదంలోనూ విందులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఆనందంగా జరుపుకునే తన ఫస్ట్ నైట్ ను ఎందుకు పండుగలా జరుపుకోవద్దని ఒక యువకుడు ఉబలాటపడ్డాడు. అనుకుందే తడువుగా చివరకు తన తొలి రాత్రి మహోత్సవాన్ని ఘనంగా చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.. ఆయన శోభన మహోత్సవ ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫ్లెక్సీ ఫొటోను షేర్ చేస్తూ రాజేశ్ రసికతకు నెటిజన్లంతా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన మరెళ్ళ రాజేష్ అనే యువకుడు ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. లేక లేక జరుగుతున్న తన తొలిరాత్రి కోసం కామంతో రగిలిపోతూ ఎదురుచూస్తున్నట్టు ఓ ఫ్లెక్సీని కొట్టించాడు. ‘‘నేటితో నా బ్రహ్మచారి జీవితానికి సంప్రదాయబద్దంగా స్వస్తి పలికి తొలిరేయి అనుభవానికి తహతహలాడుతున్నానని’’ ఫ్లెక్సీలో ఘాటు పదాలతో అందరికీ మూడ్ వచ్చేలా కొట్టించాడు.

యుద్దానికి వెళ్లే సైనికుడి వలే రతియుద్ధాన్ని జయిస్తానని.. తన తల్లిదండ్రులను నానమ్మ, తాతయ్యలను చేస్తానని రాజేశ్ ఫ్లెక్సీలో మాట ఇచ్చాడు. భరత్ అనే నేనులో మహేష్ బాబు ‘నేను.. ’ అనే డైలాగ్ పేల్చినట్టు ‘మూరేళ్ల రాజేశ్ అనే నేను..’ అని మొదలుపెట్టి మనోడు ఏర్పాటు చేసిన ‘శోభన మహోత్సవ ఆహ్వానం’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

మీరు చదవేటప్పటికి మన రాజేశ్ తొలి రాత్రి దున్నేసుంటాడు. ఇప్పుడు మరు రాత్రికి మాత్రమే మనం ఆల్ ది బెస్ట్ చెప్పాలి.. సో రాజేశ్ రసికత చూసి ఊరోళ్లంతా నోరెళ్లబెట్టారు. అతిడి ఫ్రెండ్స్ మాత్రం ఎంకరేజ్ చేసినట్టున్నారు.ఏది ఏమైనా ఈ శోభన మహోత్సవ ఆహ్వానం మాత్రం వింతగా విడ్డూరంగా ఉంది కదా..