Begin typing your search above and press return to search.

కాగితాలతో ఇక పనిలేదు.. తొలి పేపర్ లెస్ అసెంబ్లీ

By:  Tupaki Desk   |   21 March 2022 1:30 AM GMT
కాగితాలతో ఇక పనిలేదు.. తొలి పేపర్ లెస్ అసెంబ్లీ
X
అసెంబ్లీ అంటేనే కాగితాలు చింపడం..విసిరేయడం.. గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవడం.. స్పీకర్ పై విసరడం కామన్ గా జరుగుతుంటుంది. కానీ ఇక నుంచి ఆ అసెంబ్లీలో అలా చేయడం కుదరదు ఇక.. ఎందుకంటే కాగితాలతో పనిలేని తొలి పేపర్ లెస్ అసెంబ్లీగా తీర్చిదిద్దారు.

దేశంలోనే నాగాలాండ్ అసెంబ్లీ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మొదటి పూర్తిస్థాయి కాగిత రహిత అసెంబ్లీగా నిలిచింది. అసెంబ్లీలో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ఇక పేపర్ ను వినియోగించుకుండానే పనులు నిర్వహించవచ్చు. 60మంది సభ్యులున్న ఈ అసెంబ్లీలో ఇక నుంచి ప్రతి టేబుల్పై టాబ్లెట్ లేదా ఈ బుక్ ఉంటుంది. కాగితాలతో పనిలేకుండా వివరాలను టాబ్లెట్, ఈ బుక్ లలో చూసుకోవచ్చు.

దేశంలోనే మొదటి పేపర్ లెస్ అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. నేషనల్ ఈ-విధాన్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన మొదటి శాసనసభగా నాగాలాండ్ అవతరించింది.

ఇక సభ్యులు సభా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించవచ్చు. ఈ చొరవ పేపర్ లెస్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని కేంద్రం తెలిపింది.

నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ కోసం యూనికోడ్ కంప్లైంట్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తారు. దీని ద్వారా ఏ రకమైన డేటానైనా..డాక్యుమెంట్లనైనా సులభంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా ఇంగ్లీష్ లోనే కాదు ఏ ప్రాంతీయ భాషలోనైనా చూసుకోవచ్చు. సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో డేటాను స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. దీన్ని మొబైల్ యాప్, వెబ్ సైట్ ద్వారా సులభంగా వెతికి చూసుకోవచ్చు.

నేషనల్ ఈవిధాన్ అప్లికేషన్ దేశంలోని అన్ని శాసనసభల పనితీరును పేపర్ లెస్ గా మార్చడానికి వన్ నేషన్-వన్ అప్లికేషన్ అనే సూత్రంపై అభివృద్ధి చేయబడింది. ఈ పద్ధతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో సమాచారం మొత్తం డిజిటల్ మోడ్ లోకి మార్చడం జరుగుతుంది. దీంతో ఈ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేయడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.