Begin typing your search above and press return to search.
తొలి సింగిల్ డోస్ టీకా .. జాన్సన్ అండ్ జాన్సన్ ప్రత్యేకత ఏంటంటే ?
By: Tupaki Desk | 9 Aug 2021 12:30 PM GMTకరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్ కు మన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీనితో దేశంలో తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ గా జాన్సన్ అండ్ జాన్సన్ కాగా.. ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలకు.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మధ్య గల తేడా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న కంపెనీల వ్యాక్సిన్‌లు కచ్చితంగా రెండు డోసులు వేసుకోవల్సిన పరిస్థితి. అయితే, జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రం ఒక్క డోసు వేసుకుంటే సరిపోతుంది.
అంతేకాదు, డెల్టా వేరియంట్ కు కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అని ఆ సంస్థ చెబుతోంది. సింగిల్ డోస్ తోనే డెల్టా వేరియంట్ ను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తుందని పరిశోధనల్లో స్పష్టం అయ్యింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వ్యాక్సిన్ ప్రభావం ఎనిమిది నెలల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనవి కాగా, 85 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగిన పరిశోధనల్లో తేలింది. వ్యాక్సిన్ వేసుకున్న 14 రోజుల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి.
ఈ వ్యాక్సిన్ కోల్డ్ ప్లేస్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. ఫ్రిజ్‌లో ఉంచినా మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్ అవసరం లేకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా ఉపయోగించుకునే అవకాశం ఈ వ్యాక్సిన్‌కు ఉంది. ఫైజర్, మోడెర్నా టీకాల తరహాలో ఈ వ్యాక్సిన్ కోసం ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ కాకుండా కోవిషీల్డ్ తరహాలో కరోనా వైరస్ జన్యువుల్లోని స్పైక్ ప్రోటీన్‌ను ఎడినో వైరస్‌తో సమ్మిళితం చేసి ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. కాబట్టి ఇది శరీరంలోకి ప్రవేశించగానే రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి స్పైక్ ప్రోటీన్‌పై పోరాడేందుకు సిద్ధం అవుతుంది. అమెరికాలో ఈ వ్యాక్సిన్ వినియోగం మొదలు పెట్టిన కొత్తలో వ్యాక్సిన్ వేసుకున్న వారిలో రక్తం గడ్డకట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అమెరికాలో కొన్నాళ్లు వ్యాక్సిన్ ఆపేశారు. చివరకు వ్యాక్సిన్‌పై ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.