Begin typing your search above and press return to search.
అక్టోబర్‌ను హిందూ మాసంగా ప్రకటించిన అమెరికాలోని మొదటి రాష్ట్రం
By: Tupaki Desk | 14 Oct 2022 11:30 AM GMTభారత దేశం అంటేనే సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. మనవాళ్లు ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా కూడా మన సంస్కృతిని ఆయా దేశాల్లో బతికిస్తూనే ఉన్నారు. గుడులు, గోపురాలు కట్టేసి పూజలు చేస్తున్నారు. అమెరికాలో అశేషంగా ఉన్న భారతీయులు ఇప్పుడు ఆ దేశంలోనూ మన సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇది తెలిసిన ఓ అమెరికా రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 'అక్టోబర్ ' నెలను ఏకంగా'హిందూ సంప్రదాయ మాసంగా' ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
హిందువుల సంఖ్య పెరుగుతున్నందున విదేశాలు కూడా మనవాళ్లకు ప్రాధాన్యతి ఇస్తున్నారు. విదేశీయులు అమెరికాను తమ నివాసంగా మార్చుకోవడంతో వారు సహజంగానే అక్కడ వారి సంస్కృతిని ఇనుమడింపచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోని చైనాటౌన్‌లతో చైనీయులు నిండిపోయారు. వారు వ్యాపారమే పరమావధిగా చేసుకొని జేబులు నింపుకోవాలనే కోరుకుంటారు. కానీ మన భారతీయులు సంస్కృతి,సంప్రదాయాలకు విలువనిస్తూ ఆయా దేశాల ఉన్నతికి పాటుపడుతుంటారు.
ఇప్పుడు భారతీయులకు అతిపెద్ద పండుగ సీజన్. దీన్ని ఆనందంగా నిర్వహించుకుంటున్నారు. అందుకే అక్టోబర్‌ను హిందూ వారసత్వ మాసంగా ప్రకటించింది అమెరికాలోని మొదటి రాష్ట్రం వర్జీనియా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది పండుగ సీజన్, దుబాయ్‌లో ఇటీవల బహుళ-దేవతల ఆలయ ప్రారంభోత్సవం విదేశీ సమాజంలో గొప్ప ఆనందాన్ని సృష్టించింది.
హిందూ-ఫోబిక్ సంఘటనలు.. ఆన్‌లైన్ ప్రచారం తర్వాత, అమెరికాలోని హిందూ సమాజం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అమెరికాలోని హిందువుల జనాభా ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్దది.
అమెరికాలో వర్తక, వాణిజ్య అభివృద్ధిలో శ్రమించే హిందువుల సహకారాన్ని ఎవరూ కాదనలేరు. అలాగే రెండవ తరం లేదా మూడవ తరానికి చెందిన హిందువులు చాలా మంది అక్కడ ఉన్నారు. ఇతర వర్గాలకు ఇబ్బంది కలగకుండా తమ పండుగలను గర్వంగా జరుపుకోవాలని కోరుకుంటారు.
అక్టోబరులో అనేక హిందూ పండుగలున్నాయి. ఈ సెలవుదినాలను గుర్తించడానికి వర్జీనియా ముందుకొచ్చింది. ఈ రాష్ట్రంలో అనేక పెద్ద ఈవెంట్‌లు ప్లాన్ చేయబడ్డాయి, వీటిలో బతుకమ్మ, నవరాత్రి, దసరా, దీపావళి మరియు మరెన్నో ఉన్నాయి. ఆస్ట్రేలియా, థాయిలాండ్, ఇండోనేషియా, నేపాల్, దక్షిణాఫ్రికా, జర్మనీ మరియు నార్వే వంటి దేశాల నుండి ఇతర సంఘాలు భాగస్వాములుగా పాల్గొంటుండడంతో భారతీయ హిందూ సమాజం ఈ పరిణామం పట్ల సంతోషంగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.