Begin typing your search above and press return to search.

షర్మిలకు ఫస్ట్ టైమ్ శుభవార్త... ?

By:  Tupaki Desk   |   23 Feb 2022 12:30 PM GMT
షర్మిలకు ఫస్ట్ టైమ్ శుభవార్త... ?
X
వైఎస్సార్ ముద్దుల తనయ, జగన్ సోదరి వైఎస్ షర్మిల ఫస్ట్ టైం శుభ వార్త విన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక అది చాలా మంచి వార్తగా ఆమెకు తోస్తోందిట. నిజమే ఏడాది క్రితం పార్టీ పెట్టి దానికి పేరు పెట్టి జెండాను, అజెండాను డిజైన్ చేసుకున్నాక రాజకీయంగా అన్నీ అవరోధాలే.

ఎటు చూసినా ఒడుదుడుకులే. అన్నింటికీ మించి పార్టీ పేరు విషయంలో తకరారు వచ్చింది. అన్న వైఎస్సార్ పార్టీ వారు ఒకరు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద చేసిన ఫిర్యాదు తో షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ చాలా నెలలుగా ఆగిపోయింది.

వైఎస్సార్టీపీ అన్న పేరు మీద పార్టీని నమోదు చేయాలనుకున్నా ఏడాది దాకా కుదరలేదు, దాని మీద ఎంతో శ్రమించాక కరస్పాండెన్స్ చేయడమే కాక షర్మిల పార్టీ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరుపుతూ వారి సందేహాలను తీరుస్తూ మొత్తానికి కధను సుఖాంతం చేశారు అని సమాచారం. వైఎస్సార్ పేరు షర్మిల పార్టీకే ఖరారు అయింది. ఆ విధంగానే పార్టీ రిజిష్టర్ అయింది.

ఇపుడున్న పరిస్థితుల్లో షర్మిలకు ఇది అతి పెద్ద గుడ్ న్యూస్ గా భావిస్తున్నారు. ఇక మీదట తెలంగాణాలో రాజకీయ ప్రస్థానాన్ని మరింత జోష్ గా కొనసాగించేందుకు బలమిచ్చేలా ఈ వార్త ఉంది అంటున్నారు.

ఇంకో వైపు తొందరలోనే తెలంగాణా అంతటా నాలుగు వేల కిలోమీటర్ల దూరం భారీ పాదయాత్ర చేయడానికి షర్మిల రెడీ అవుతోంది అన్నది పార్టీ వర్గాల సమాచారం.

అంటే 2023లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే అప్పటిదాకా జనంలోనే ఉంటూ పాదయాత్రలోనే అందరినీ కలుస్తూ పార్టీని లైవ్ లో ఉంచాలన్న షర్మిల యాక్షన్ ప్లాన్ కి ఇపుడు కేంద్ర ఎన్నికల సంఘం తాజా శుభ వార్తలో ఫుల్ ఖుషీగా నాయకులు ఉన్నారని అంటున్నారు. మొత్త్తానికి తండ్రి పేరుని ఆయన రాజకీయ పలుకుబడిని, సెంటిమెంట్ ని వాడుకోవడానికి షర్మిలకు ఇపుడు పూర్తి హక్కులు లభిస్తున్నాయి. సో ఆమె ఇక తెలంగాణా రాజకీయ మైందానంలో ఎలా దూసుకుపోతారో చూడాలి.