Begin typing your search above and press return to search.
40 ఇయర్స్ లో ఫస్ట్ టైం.. బాబుకు ఇంత షాక్ తగులుతోందా...!
By: Tupaki Desk | 19 Nov 2022 7:58 AM GMTనిజాలకు.. రాజకీయాలకు పెద్దగా పడదు. రెండు కూడా వైరి పక్షాలే. కానీ, ఒక్కొక్క సారి మాత్రం నాయకులు కాదన్నా.. ఔనన్నా.. నిజాలను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు టీడీపీలోనూ ఇదే పరిస్థితి ఏర్పడిం ది. గత ఆరు మాసాల్లో.. టీడీపీ పరిస్థితిని తీసుకుంటే.. 40 ఇయర్స్‌లో ఎప్పుడూ.. ఎన్నడూ.. ఎక్కడా జరగని అవమానాలు ఎదురవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై..వరుస రాళ్ల దాడులు.. అడ్డగింతలు.. ఎదురు కావడం గమనార్హం.
గతంలో విశాఖకు వెళ్తే.. అక్కడ ఎదురుదాడి జరిగింది. విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా.. పోలీ సులు అంటారు కానీ.. వైసీపీ నాయకులు.. ఓ వర్గం ప్రజలే అడ్డుకున్నారు.
ఇక, తర్వాత.. విజయవాడలో ఆయన నివాసంపై కి వైసీపీ ప్రస్తుత మంత్రి జోగి రమేష్.. దాడికి యత్నించారు. ఇది తీవ్ర కలకలం సృష్టిం చింది. ఇది జరిగిన మరికొద్ది రోజులకే మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై.. రాళ్ల దాడి.. భౌతిక దాడి కూడా చోటు చేసుకుంది.
ఇక, ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇటీవల కేవలం.. రెండు వారాల్లోనే మరో రెండుసంచలన ఘట్టాలు చోటు చేసు కున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఒక ఆగంతకుడు.. చంద్రబాబు కాన్వాయ్‌పై రాయి విసిరాడు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది చీఫ్‌కు తీవ్ర గాయమైంది. కట్ చేస్తే.. ఇప్పుడు కర్నూలులోనూ.. చంద్రబాబు పై రాళ్ల దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వారు.. ఆయనపై రాళ్లు విసిరారు. అంతేకాదు.. గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఈ పరిణామాలు.. చంద్రబాబును తీవ్రస్థాయిలో కలవరపెడుతున్నాయి. ఇన్నాళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో ఎన్నడూ ఎదురుకాని ఘటనలతో ఆయన సతమతం అవుతున్నారు. దీనిని పైకి మాత్రం వైసీపీ గూండాలు చేస్తున్నారని.. చంద్రబాబు సరిపుచ్చుకోవచ్చు.
కానీ, అంతర్గతంగా మాత్రం ఆయన తల్లడిల్లుతున్నది ఒక్కటే.. ఈ వ్యతిరేకత వెనుక..ఎవరున్నారు? ఏం చేస్తున్నారు? అనే. ఈ పరిణామాలపైనే చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.