Begin typing your search above and press return to search.
ఫస్ట్ టైం.. కేసీఆర్ సార్ బ్యాక్ స్టెప్
By: Tupaki Desk | 27 Dec 2020 3:36 PM GMTమొన్నటివరకు నేను రాసింది రాత.. గీసింది గీత అన్నట్టుగా సాగిన తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారశైలి రెండు ఎన్నికల్లో ఓటములతో భారీగా మారినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో సంచలన నిర్ణయానికి కేసీఆర్ నాందిపలకడం విశేషం.
కేసీఆర్ పట్టుబట్టి రాష్ట్రంలో నియంత్రిత సాగు పేరిట తాను చెప్పిన పంటలను వేయాలని మొన్నటి వర్షకాలంలో రైతులకు కట్టుబాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. లేకుంటే నష్టపోతారని హెచ్చరించడంతో రైతులు పాటించారు. ఈ క్రమంలోనే వ్యతిరేకత పెల్లుబుకడంతో నియంత్రిత సాగు విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై తెలంగాణలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంటల కొనుగోళ్లు, సాగు అంశాలపై సమీక్ష చేసిన కేసీఆర్ ఈ సందర్భంగా తెలంగాణలో పంటల నియంత్రణ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రైతులు ఏ పంట వేయాలో ఇకపై వాళ్లదే నిర్ణయమని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో పంటల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఉండవని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో పంటలను కేసీఆర్ సర్కారే కొంటోంది. ఈ క్రమంలోనే ఈ కొనుగోళ్ల ద్వారా 7500 కోట్లు నష్టం రావడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా రైతులు పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కేంద్రప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నియంత్రిత సాగు పేరిట కేసీఆర్ చెప్పిన పంటలు వేయాలని రాష్ట్రంలో నిర్ణయించడం తొలి నుంచి వివాదాస్పదమైంది. దీనిపై రైతులు, విపక్షాలు సహా రైతు నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో కేసీఆర్ సర్కార్ తొలిసారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం విశేషం.