Begin typing your search above and press return to search.

అక్కడ మగచెట్టు ఆడచెట్టు అవుతోంది

By:  Tupaki Desk   |   3 Nov 2015 10:30 PM GMT
అక్కడ మగచెట్టు ఆడచెట్టు అవుతోంది
X
కాలం మారింది. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. మగాళ్లు ఆడోళ్లుగా మారటం.. ఆడోళ్లు మగాళ్లుగా మారిపోవటం తెలిసిందే. ఎవరికి ఎలా కావాలంటే అలా మారిపోయేందుకు అనువుగా సైన్స్ అందుబాటులోకి వచ్చేసింది. సైన్స్ పరిధి పెరగటంతో పాటు.. దాన్ని ఉపయోగించుకునే సాంకేతికత అందరి చేతుల్లోకి వచ్చేసింది. అయితే.. అలాంటిదేమీ లేక వేల ఏళ్లుగా ఉన్న చెట్టులో సహజసిద్ధంగానే తనకు తాను మారిపోవటం ఇప్పుడో వింతగా మారింది.

లింగమార్పిడి లాంటివి ఏమీ లేకుండా లింగమార్పిడికి గురి కావటం ఇప్పుడు పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. బ్రిటన్ లోని ఒక చెట్టు ఇంతకాలం మగ చెట్టుగా ఉంది. అది కాస్తా ఇప్పుడు ఆడ చెట్టుగా మారిపోవటం విస్మయానికి గురి చేస్తోంది.

దాదాపు 3 నుంచి 5 వేల వయసున్న ‘‘ద ఫోర్టింగల్ యూ’’ అనే మగ చెట్టు.. ఈ మధ్య కాలంలో ఆడచెట్టుగా మారిపోయి కాయలు కాయటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఫోర్టింగల్ యూకు ఈ అక్టోబరులో ఒక కొమ్మకు మూడు ఎరుపు బెర్రీలు కాయటంతో వారు ఆశ్చర్యపోయారు. వేలాది ఏళ్లుగా లేనిది ఒక్కసారిగా ఒక కొమ్మ మాత్రం తన సహజసిద్ధ లక్షణాలకు భిన్నంగా కాయలుకాయటంతో చెట్టును అసాంతం పరీక్షించారు. చెట్టు మొత్తం మగ లక్షణాలతో ఉండగా.. సదరు కొమ్మ మాత్రం ఆడలక్షణాలతో ఉండటం ఇప్పుడు చర్చగా మారింది. సాధారణంగా చెట్టు పై భాగాన మగ కాస్తా ఆడగా మారే అవకాశం ఉందని.. కానీ.. ఇందుకు భిన్నంగా ఒక కొమ్మకు కాయలు కాయటం విచిత్రంగా ఉందని చెబుతున్నారు. ఇలా ఎలా జరిగిందన్న దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు.