Begin typing your search above and press return to search.

హ‌క్కుల కోసం పోరాడినందుకు ఆమె త‌ల‌నరికిన స‌ర్కారు

By:  Tupaki Desk   |   23 Aug 2018 1:30 AM GMT
హ‌క్కుల కోసం పోరాడినందుకు ఆమె త‌ల‌నరికిన స‌ర్కారు
X
గ‌ల్ఫ్ అంటేనే క‌ఠిన శిక్ష‌ల‌కు పెట్టింది పేరు. అమాన‌వీయ‌మైన నిర్ణ‌యాల‌కు చిరునామా. ముస్లిం పాల‌కుల ఏలుబ‌డిలో ఉన్న ఈ దేశాలు వేసే శిక్ష‌లు ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంటాయి. అలా క‌ల‌కలం రేపే శిక్షల ప‌రంప‌ర‌లో ఇదొక‌టి. ఎడారి దేశమైన‌ సౌదీ అరేబియాలో మహిళ హక్కుల కోసం పోరాడిన ఓ కార్యక్తర తల నరికేశారు. ఇలా చేసింది సాక్షాత్తు పాల‌కులే కావ‌డం. ఎస్రా అల్-ఘంఘం అనే మహిళా హక్కుల కార్యకర్తకు న్యాయమూర్తి మరణ దండన శిక్ష విధించడంతో బహిరంగంగా ఆమె తల నరికారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎస్రా అల్-ఘంఘం షియాల ప్రాబల్యం ఉన్న ఖతీఫ్ ప్రాంతంలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా - రాజకీయ నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని శాంతియుతంగా నిరసనగా ప్రదర్శనలు నిర్వహించేది.ఘంఘంని ఆమె భర్త సయ్యద్ మూసా జాఫర్ హషెం కళ్లెదురుగా డిసెంబర్ 8 - 2015న భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొన్నాయి. రాజద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆమెపై అభియోగం మోపినట్టు లండన్ లోని అల్-ఖుద్స్ అల్-అరేబియా న్యూస్ పేపర్ తన ట్విట్టర్ లో తెలిపింది. దాదాపు మూడేళ్లు జైల్లో గడిపిన ఘంఘం కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడంతో… తన తరఫున వాదించేందుకు లాయర్ ని నియమించుకోలేక పోయింది. దీంతో ప్రభుత్వం ఏకపక్షంగా ఆమెకు బహిరంగ శిరచ్ఛేద మరణశిక్ష విధించింది. నాలుగు రోడ్ల కూడలిలో భద్రతా బలగాల సమక్షంలో ప్రజలంతా చూస్తుండగా ఈ శిక్షను అమలు చేశారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలో తలారి ఆమె తలను నేలకు తాకేలా సరిగ్గా అమర్చి కత్తితో ఒక వేటుకి నరికేయ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌టంపై అనేక‌మంది నెటిజ‌న్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

కాగా, సౌదీ అరేబియాకు కొత్త రాజుగా ఎన్నికైన మొహమ్మద్ బిన్ సల్మాన్ సామాజిక సంస్కరణలు చేపడుతూ దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకొంటున్న సమయంలో ఘంఘం శిరచ్ఛేదం జరగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దేశాల్లో ఎప్పుడు ప్ర‌జాస్వామ్యయుత ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని పలువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.