Begin typing your search above and press return to search.
ఆ సంపన్న దేశానికి తొలి మహిళా ప్రధాని.. గంటల్లోనే రాజీనామా
By: Tupaki Desk | 25 Nov 2021 5:31 AM GMTఆసక్తికర రాజకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది స్వీడన్. యూరోపియన్ యూనియన్ లో భాగమైన ఈ సంపన్న దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ మహానగర జనాభాతో పోలిస్తే తక్కువగా ఉండే ఈ దేశంలో చదరపు కిలోమీటర్ కు కేవలం 22 మంది మాత్రమే నివసిస్తుంటారు. ప్రపంచంలోని అత్యంత మెరుగైన జీవన ప్రమాణాలున్న దేశంగా స్వీడన్ కు మంచి పేరుంది. పర్యావరణ సంరక్షణ.. వాతావరణసమతౌల్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ దేశంలో అత్యంత స్వేచ్ఛాయుతమైన దేశంగా పేరుంది.
అలాంటి ఆధునిక సమాజం ఉన్న దేశానికి తొలిసారి ఒక మహిళా నేత దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు 54 ఏళ్ల మగ్డలినా అండర్సన్. స్త్రీ.. పురుష సమానత్వం విషయంలో ప్రగతిపథంలో ఉన్న దేశంగా చెప్పే స్వీడన్ లో ఇంతకాలానికి ఒక మహిళ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవటంవిశేషం.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రధాని ఎన్నికల్లో ఓడినప్పటికీ ఆమె ప్రధాని పీఠం మీద కూర్చున్నారు. దీనికి ఆ దేశంలో ఉన్న విచిత్రమైన నిబంధనే. స్వీడన్ పార్లమెంట్ లో మొత్తం 349 మంది సభ్యులు ఉంటారు. ప్రధాని ఎన్నిక కోసంనిర్వహించే ఎన్నికల్లో పాల్గొనే వారికి మెజార్టీ ఓట్లు రాకున్నా ఫర్లేదు.. వ్యతిరేక ఓట్లు 175 మాత్రం రాకూడదు.
మగ్డలినా విషయంలో ఆమెకు అనుకూలంగా 117 ఓట్లు మాత్రమే రాగా.. వ్యతిరేక ఓట్లు 174 మాత్రమే వచ్చాయి. దీంతో.. ప్రధాని కాకుండా ఉండటానికి రావాల్సిన ఓట్ల కంటే ఒక్క ఓటు తక్కువగా రావటంతో ఆమె ప్రధానమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు.
అయితే.. గంటల వ్యవధిలోనే ఆమె తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన రావటం ఆసక్తికర రాజకీయ పరిణామంగా చెప్పాలి. దీనికి కారణం చూస్తే.. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ విఫలం కావటంతో పాటు.. రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నుంచి గ్రీన్స్ పార్టీ బయటకు వెళ్లిపోవటంగా చెబుతున్నారు. అంతకు ముందు నూతన ప్రధానిగా బాధ్యతల్ని చేపట్టిన మాగ్డలినా ఎంపికకు స్వీడన్ పార్లమెంట్ రిక్స్ డాగ్ ఆమోదం తెలిపింది.
ఇంతకీ ప్రధానమంత్రిని ఎంపిక చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది చూస్తే.. సోషల్ డెమొక్రటిక్ పార్టీకి అధినేతగా వ్యవహరించిన స్టెఫాన్ లవ్ ఫెస్ కొద్ది రోజుల క్రితం పార్టీ పదవికి.. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో.. కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంతకూ స్టెఫాన్ లవ్ ఫెస్ ఎందుకు రాజీనామా చేశారన్న విషయంలోకి వెళితే.. వచ్చే ఏడాది అంటే 2022లో స్వీడన్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడేళ్లుగా స్వీడన్ ప్రధానిగా ఉన్న ఆయన.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన సన్నద్ధతకు అవసరమైన సమయం కోసం ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారు. ఈ నెల 10న ఆయన తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉంటే.. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాగ్డలినా కొద్ది గంటలకే తన పదవికి రాజీనామా చేయాల్సి రావటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ను ఆమోదించే విషయంలో ఫెయిల్ కావటం.. ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లుగా గ్రీన్స పార్టీ వెల్లడించటంతో ఆమె తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి. దేశ పప్రధాని అయ్యానన్న సంతోషం గంటలు మాత్రం ఆమెకు మిగిలాయి. తన రాజీనామా లేఖను ఆమోదించటానికి వీలుగా ఆమె స్పీకర్ కు లేఖ పంపారు.